Raviteja : నేను జాతకాన్ని నమ్మను.. సినిమా నాకు నచ్చితే మీకు నచ్చినట్టే..

తాజాగా ఖిలాడీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. ''అనసూయ తో చేయడం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకి అంతకుముందు పని చేయని.......

Raviteja : నేను జాతకాన్ని నమ్మను.. సినిమా నాకు నచ్చితే మీకు నచ్చినట్టే..

Raviteja

Khiladi :   రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా ‘ఖిలాడి’ సినిమా రాబోతుంది. రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాని కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఖిలాడీ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ బాగా క్లిక్ అయ్యాయి. వాటికి మంచి ప్రజాదరణ లభిస్తుంది. సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

Punjab : మానవత్వం చూపించిన సోనూ సూద్

తాజాగా ఖిలాడీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. ”అనసూయ తో చేయడం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకి అంతకుముందు పని చేయని వాళ్ళతో పనిచేశాను. నేను జాతకాన్ని, అదృష్టాన్ని నమ్మను. రవితేజ ఎప్పుడూ యాక్టర్ గా సినిమా చూడడు, ఆడియన్ గా మాత్రమే చూస్తాడు. సినిమా బాగుంది. నాకు నచ్చితే కచ్చితంగా మీకు నచ్చినట్టే. ఎందుకు అంటే మీలో నేను ఒకడిని. బాడీలో రిధమ్ ఉంటే మంచి యాక్టర్ అవుతారు అది ఈ ఇద్దరి హీరోయిన్స్ లో చూశాను. నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు చాలా గొప్ప వ్యక్తి. మీరంతా మాస్క్ వేసుకొని సినిమా ఎంజాయ్ చేయండి. జై సినిమా” అని సినిమా గురించి, టీం గురించి తెలిపారు.