Pawan Kalyan: నన్ను ఒక కులానికి పరిమితం చెయొద్దు, సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు- పవన్ కల్యాణ్
వినాయక చవితి పండగలో మైక్ లు పెట్టి అబ్బని తియ్యని దెబ్బ అనే పాటలు పెడుతున్నారు. ముస్లింలు మసీదుల మీద పెట్టే మైకుల్లో అలాంటి పాటలు వేయరు కదా..?
Pawan Kalyan: తమిళనాడులో విజయ్ విజయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. పక్క రాష్ట్రంలో ఓ యాక్టర్ పార్టీ పెట్టి సీఎం అయితే ఇక్కడ అందరూ నన్ను చంపేస్తున్నారు అని పవన్ అన్నారు. 2024లో టీడీపీతో పొత్తు లేకుండా ఉంటే బాగుండేదని నా చెవిలో ఊదరగొట్టేస్తున్నారని చెప్పారు. అయితే, తమిళనాడులో పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు వేరు.. ఇది అందరూ గుర్తుంచుకోవాలి అని పవన్ తేల్చి చెప్పారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
”ఆరోజు ఒంటరిగా పోరాటానికి సిద్ధమయ్యా.. మచిలీపట్నం సభకు 10 లక్షల మంది వచ్చారు.. ఆరోజు పరిస్థితులు వేరు.. జైల్లో చంద్రబాబుని కలిసి రాష్ట్రం కోసం ఆలోచించి పొత్తు పెట్టుకున్నాం. కరోనా వల్ల బీజేపీ సరైన రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయింది. ఇంకోసారి వైసీపీ వస్తే రాష్ట్రం దారుణంగా దెబ్బతినేది. ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాగేసే వారు. పొత్తులో ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులన్నీ నాకు తెలుసు. పెద్ద పెద్దవి కాకపోయినా ఇబ్బందులు ఉన్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయి. కమిటీ నియమించాం.. కమిటీ చూసుకుంటుంది.. అప్పటికి మీ ఆత్మ గౌరవం దెబ్బతింటుంటే నేను చూస్తూ ఊరుకోను. నేను మద్దతిస్తే త్రికరణ శుద్ధిగా ఇస్తా. అవతల నుండి అలానే ఆశిస్తా” అని పవన్ కల్యాణ్ అన్నారు.
వినాయక చవితి పండగలో మైక్ లు పెట్టి అబ్బని తియ్యని దెబ్బ అనే పాటలు పెడుతున్నారు. ముస్లింలు మసీదుల మీద పెట్టే మైకుల్లో అలాంటి పాటలు వేయరు కదా..? మనది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ అంశాలపైన మాట్లాడాలి. దేశం గురించి ఎవరైనా మాట్లాడితే మనం గొంతు ఎత్తాలి. జై అమరావతి అంటే 33 వేల ఎకరాలకే పరిమితం అవుతుంది. జై ఆంద్రా అంటే ఐదు కోట్లకి సంబంధించినది అవుతుంది.
11 సీట్లకు పరిమితమైన వాళ్ళూ మనపై సెటైర్లు వేస్తారా?
11 సీట్లకు పరిమితం అయిన వాళ్ళు కూడా మనపై సెటైర్లు వేస్తున్నారు. వాళ్ల గురించి మాట్లాడటం మానేశా. కానీ కొన్నిసార్లు వాళ్ల మాటలకు చిరాకొచ్చి మాట్లాడతా. అభివృద్ధి జరగాలంటే కొంత ప్రకృతి వనరులు ధ్వంసం అవుతాయి తప్పదు.
నన్ను ఒక కులానికి, ప్రాంతానికి పరిమితం చెయ్యాలని చూశారు. నేను ఒక కులంలో పుట్టాల్సి వచ్చింది. దానికి నేనేం చేస్తా. కాపు కులంలో పుట్టా.. కాపుల గురించే పని చెయ్యడానికి నేను లేను. అన్ని కులాల గురించి పని చెయ్యడానికి వచ్చాను. ప్రాణహాని ఉందని వంగవీటి మోహన్ రంగా మాట్లాడితే అప్పుడు ఈ నేతలంతా ఎందుకు ఆయనకి రక్షణగా లేరు..? ఈరోజు మాట్లాడే నాయకులు ఆరోజు ఉన్నారు కదా..? పైగా యువకులుగా ఉన్నారు. రక్షణ ఇవ్వలేకపోయారు. బతికుండగా ఆయనని కాపాడుకోలేని వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు..? కాపులంతా నాకు ఓట్లు వేస్తే భీమవరం, గాజువాకలో ఎందుకు ఓడిపోతాను..?
సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని కొందరు మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు..? ఎన్నికలయ్యాక అసెంబ్లీలో మాట్లాడటం ఏంటి..? ఓట్లు పోతాయనా..? సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంత ఈజీనా.. వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సనాతన ధర్మం గురించి సరిగ్గా తెలిస్తే అలాంటి మాటలు మాట్లాడరు..?” అంటూ పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్.
Also Read: ఆయనతో నన్ను పోల్చకండి- విజయ్ విజయంపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్
