Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసు.. సోషల్ మీడియాలో జడ్జిపై వస్తున్న ఆరోపణలు బాధాకరం- హైకోర్టు
బండి సాయి భగీరథ్ బెయిల్ పిటీషన్ ను న్యాయమూర్తి మాధవి దేవి విచారిస్తున్నారు. కాగా, న్యాయమూర్తి భర్తకు ఆఫర్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
Bandi Bhagirath Case: బండి భగరీథ్ పై నమోదైన పోక్సో కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో జడ్జిపై వస్తున్న ఆరోపణలు బాధాకరం అంది. సోషల్ మీడియాలో ప్రచారం తనకు బాధ కలిగించిందని తెలంగాణ హైకోర్టు నాయామూర్తి జస్టిస్ టి మాధవి దేవి వాపోయారు.
బండి సాయి భగీరథ్ బెయిల్ పిటీషన్ ను న్యాయమూర్తి మాధవి దేవి విచారిస్తున్నారు. కాగా, న్యాయమూర్తి భర్తకు ఆఫర్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. సోషల్ మీడియాలో అలా సర్క్యులేట్ కావడం తనకు బాధ కలిగించిందన్నారు న్యాయమూర్తి. వాట్సాప్ లో సర్క్యులేషన్ ను హైదరాబాద్ సీపీకి పంపుతామన్నారు పీపీ. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని భగీరథ్ న్యాయవాది నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
