Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసు.. సోషల్ మీడియాలో మాపై జరుగుతున్న ప్రచారం బాధాకరం- హైకోర్టు జడ్జి
బండి సాయి భగీరథ్ బెయిల్ పిటీషన్ ను న్యాయమూర్తి మాధవి దేవి విచారిస్తున్నారు. కాగా, న్యాయమూర్తి భర్తకు ఆఫర్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
- Naveen
- Updated on- May 15, 2026 / 10:57 PM IST
Bandi Bhagirath Case: బండి భగరీథ్ పై నమోదైన పోక్సో కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియాలో జడ్జిపై వస్తున్న ఆరోపణలు బాధాకరం అంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తనకు బాధ కలిగించిందని తెలంగాణ హైకోర్టు నాయమూర్తి జస్టిస్ టి మాధవి దేవి వాపోయారు.
బండి సాయి భగీరథ్ బెయిల్ పిటీషన్ ను న్యాయమూర్తి మాధవి దేవి విచారిస్తున్నారు. కాగా, న్యాయమూర్తి భర్తకు పదవి ఆఫర్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. సోషల్ మీడియాలో అలా సర్క్యులేట్ కావడం తనకు బాధ కలిగించిందన్నారు న్యాయమూర్తి. వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న వాటిని హైదరాబాద్ సీపీకి పంపుతామని పీపీ తెలిపారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని భగీరథ్ తరపు న్యాయవాది కోరారు.
ఇటు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి వివరాలు బహిర్గతంపై పోలీసులు సీరియస్ అయ్యారు. బాధితురాలి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రావటంపై బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో బాధితురాలు, ఆమె కుటుంబం ఫోటోలు గుర్తించిన పోలీసులు సోషల్ మీడియా ఖాతాదారులపై కేసులు నమోదు చేశారు. బాధితురాలి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: బండి భగీరథ్ కేసు.. బాధితురాలి బర్త్ సర్టిఫికెట్ పరిశీలన, మరోసారి స్టేట్‌మెంట్ రికార్డ్
