Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు..
రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Rain Alert)కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Meteorological Department warned heavy rains in Telangana and Andhra Pradesh next three days.
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.
- మూడ్రోజుల పాటు పిడుగుల హెచ్చరిక.
- గంటకు 50కిమీ ఈదురుగాలులు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలకమైన అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు (Rain Alert)కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా అంచనా:
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు దంచికొట్టనున్నాయి. జూన్ 25న ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 26, 27 తేదీల్లోనూ పలుచోట్ల వర్షాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కూడా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
తెలంగాణలో వాతావరణ పరిస్థితి & జాగ్రత్తలు:
తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ సహా దాదాపు 28 జిల్లాల్లో మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు.
