Bandi Bagirath Case: బండి భగీరథ్ కేసు.. బాధితురాలి బర్త్ సర్టిఫికెట్ పరిశీలన, మరోసారి స్టేట్మెంట్ రికార్డ్
బాధితురాలి స్టేట్ మెంట్ ఆధారంగా మొయినాబాద్ ఫామ్ హౌస్, నానక్ రామ్ గూడ సర్వీస్ అపార్ట్ మెంట్ కి వెళ్లి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Bandi Bagirath Case: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. మరోసారి బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలిని రెండుసార్లు విచారించిన పోలీసులు బాధితురాలి బర్త్ సర్టిఫికెట్ ను పరిశీలిస్తున్నారు. బాలిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు ఆధారాలు సమర్పించడంతో జీహెచ్ఎంసీ రికార్డ్స్ ను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు బాధితురాలి స్టేట్ మెంట్ ఆధారంగా మొయినాబాద్ ఫామ్ హౌస్, నానక్ రామ్ గూడ సర్వీస్ అపార్ట్ మెంట్ కి వెళ్లి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు భగీరథ్. దీనిపై తీర్పు రావాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేశారు పోలీసులు. బాధితురాలి బర్త్ సర్టిఫికెట్ కు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి సింగిల్ బెంచ్ ముందు ఉంచనున్నారు పోలీసులు.
పోక్స్ కేసుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో సిట్ అపాయింట్ చేసింద సర్కార్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు సిట్ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి కీలక విషయాలను జడ్జి ముందు ఉంచారు.
Also Read: బండి భగీరథ్ కేసుపై అనసూయ షాకింగ్ పోస్ట్.. వైరల్ అవడం కోసమే చేస్తావా.. నెటిజన్స్ ఫైర్
