Voter Registration : 2002 ఓటర్ లిస్టులో మీ పేరు లేదా? ఆధార్ తప్పనిసరా? ఓటరు ఐడీ లేకుంటే ఫారమ్ ఎలా సమర్పించాలి?
Voter Registration : సర్ 2002 ఓటర్ జాబితాలో లేరా? కొత్త ఓటరుగా మీ పేరుగా ఎలా ఎక్కించాలో తెలుసా? ఆధార్ తప్పనిసరిగా ఇవ్వాలా? ఫారమ్ ఇతరులు కూడా సమర్పించవచ్చా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Voter Registration
Voter Registration : మీరు SIR 2002 ఓటర్ జాబితాలో లేకపోతే, మీ ఇల్లు లేదా వయస్సుకు సంబంధించిన ఏవైనా పత్రాలను (పాఠశాల సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, బ్యాంక్ ఖాతాలు, పాస్‌పోర్టులు, డ్రైవింగ్ లైసెన్సులు, పుట్టిన తేదీ లేదా నివాసం, ప్రభుత్వంచే అందించే ఇతర పత్రాలు) సమర్పించి ఓటరు జాబితాలో మీ పేరును ఎక్కించుకోవచ్చు. ఎన్నికల సంఘం అన్ని పత్రాలు, వివరాలను చెక్ చేశాక మీ పేరును ఓటరు జాబితాలో చేర్చుతారు.
కొత్త ఓటరుగా పేరు ఎలా ఎక్కించాలి? :
31/07/2026న ముసాయిదా ఓటరు జాబితా తర్వాత మీరు మీసేవా ద్వారా ఫారమ్ 6 నింపి లేదా ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఫారమ్ 6 ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్ అధికారి (ERO)కి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వయస్సు 31/07/2026 నుంచి 30/08/2026 వరకు అర్హత తేదీన 18 ఏళ్లు పూర్తి అయి ఉంటే కూడా ఓటరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
అయితే, సమర్పించిన ఫారమ్‌తోపాటు పత్రాలను ధృవీకరించే ఓటరు లిస్టును BLO ద్వారా అందుబాటులో లేకపోతే ఓటరు తగిన సమయంలో సమర్పించవచ్చు. ఓటరు తగిన పత్రాలను సమర్పించి ఎన్నికల సంఘం ద్వారా పరిశీలిస్తారు.
Read Also : Voter Enumeration Form : ఫారం తిరిగి ఇవ్వకపోతే ఏమౌతుంది? ఓటరు ఎప్పుడు సమర్పించాలి? ఏయే పత్రాలు అవసరం?
ఓటరు ఫారమ్ ఇతరులు ఎవరైనా సమర్పించవచ్చా? :
కొత్త ఓటరు రిజిస్ట్రేషన్ విషయంలో సదరు వ్యక్తి తప్పనిసరిగా ఉండటం మంచిది. కానీ, పత్రాల ద్వారా మీ నివాసం, వయస్సుకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉంటే మీ తరఫున మరో వ్యక్తి ద్వారా కూడా ఫారమ్ సమర్పించవచ్చు.
ఆధార్ తప్పనిసరిగా ఇవ్వాలా? :
లేదు.. దరఖాస్తుదారుని పేరును సమర్పించేందుకు ఆధార్ సంఖ్య తప్పనిసరి కాదు. కేవలం ఆప్షనల్ మాత్రమే.. ఓటరు ఆధార్ సంఖ్య ద్వారా పత్రాల ధృవీకరణకు వీలుంటుంది. ఓటరు ఫారమ్‌లో ఫోటో తప్పుగా ఉంటే సరిదిద్దుకోవాలంటే ముందుగా సంబంధిత ఎన్నికల అధికారికి కొత్త ఫొటోను సమర్పించి వెంటనే సరిదిద్దుకోవచ్చు.
ఎన్నికల జాబితాలో చేరిన తర్వాత ఓటరు కార్డ్‌లో వ్యక్తిగత వివరాలలో మార్పులు చేసుకోవాలంటే.. సంబంధిత ఎన్నికల అధికారికి తగిన పత్రాలతో కలిసి దరఖాస్తు చేయాలి. అధికారులు పరిశీలించిన తర్వాత అవసరమైన మార్పులు చేస్తారు.
