Raviteja : రోజువారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రవితేజ.. రోజుకి ఎంతో తెలుసా??

రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు 12 నుంచి 15 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు. ఒక సినిమాకి 20 నుంచి 25 రోజుల డేట్స్ ని కేటాయిస్తారు. అప్పుడప్పుడు క్యారెక్టర్ లెంగ్త్ ని......

Raviteja : రోజువారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న రవితేజ.. రోజుకి ఎంతో తెలుసా??

Raviteja

 

Raviteja :  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మాస్ మహారాజ్ గా ఎదిగారు రవితేజ. ఆయన జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. రవితేజ ఇటీవల సినిమాల జోరు పెంచాడు. వరుస సినిమాలని లైన్లో పెట్టి షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నాడు రవితేజ. సాధారణంగా రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు 12 నుంచి 15 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు. ఒక సినిమాకి 20 నుంచి 25 రోజుల డేట్స్ ని కేటాయిస్తారు. అప్పుడప్పుడు క్యారెక్టర్ లెంగ్త్ ని బట్టి ఎక్కువ రోజులు కూడా కేటాయించాల్సి వస్తుంది. అయితే ఇటీవల రవితేజ ఇలా సినిమాకింత రెమ్యునరేషన్ అని కాకుండా రోజుకి ఇంత అని తీసుకుంటున్నారట.

ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాకి ఇంత అని మాట్లాడుకుంటారు. సినిమా మొత్తానికి కలిపి ఒకే అమౌంట్ అనుకోని దాన్ని రెండు లేదా మూడు సార్లుగా తీసుకుంటారు. కానీ మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, వివిధ క్రాఫ్ట్స్ వాళ్ళు చాలా మంది కూడా రోజుకి ఇంత రెమ్యునరేషన్ అని తీసుకుంటారు. ఆ ఆర్టిస్ట్, ఆ టెక్నిషియన్ రేంజ్ ని బట్టి రోజువారీ వేతనం ఇస్తారు. కానీ హీరో రోజువారీ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే మొదలు ఏమో. రవితేజ ప్రస్తుతం రోజుకి 50 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Isha Koppikar : హీరోని ఏకాంతంగా కలవమన్నారు.. కలవనందుకు సినిమా నుంచి తీసేశారు..

ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలకి రవితేజ ఇలాగే తీసుకుంటున్నారని టాక్. దీనివల్ల షూటింగ్ డేట్స్ పెరిగితే రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. దర్శక నిర్మాతలు షూటింగ్ షెడ్యూల్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే రవితేజని తక్కువ రెమ్యునరేషన్ కే తీసుకు రావొచ్చు, లేదా అతనికి మాములుగా ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే అవుతుంది. ఇలా రోజు వారి రెమ్యునరేషన్ తీసుకుంటూ సినిమాకి 15 నుంచి 20 కోట్ల వరకు తీసుకోవాలని రవితేజ చూస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు లైన్లో పెట్టి, షూటింగ్స్ కి వరుస డేట్స్ ఇస్తూ బాగానే సంపాదిస్తున్నారు రవితేజ.