Isha Koppikar : హీరోని ఏకాంతంగా కలవమన్నారు.. కలవనందుకు సినిమా నుంచి తీసేశారు..

ఇషా కొప్పికర్ మాట్లాడుతూ.. ''నేను కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌లోకి వచ్చాను. ఆ సమయంలోనే సినిమా వకాశాలు వచ్చాయి. కెరీర్‌ మొదట్లోనే నన్ను కూడా......

Isha Koppikar : హీరోని ఏకాంతంగా కలవమన్నారు.. కలవనందుకు సినిమా నుంచి తీసేశారు..

Isha

Updated On : March 3, 2022 / 7:13 AM IST

 

Isha Koppikar :  తెలుగులో నాగార్జున సరసన ‘చంద్రలేఖ’ సినిమాలో నటించిన ఇషా కొప్పికర్ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. రమ్యకృష్ణతో కలిసి అల్లరి చేసి సినిమాలో అలరించింది. ఆ తర్వాత వెంకటేష్ సరసన ‘ప్రేమతో రా’ సినిమాలో కనిపించింది. మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయింది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నిఖిల్ ‘కేశవ’ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ తో తెలుగులో కనపడింది. ఇప్పుడు కూడా బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ బిజీగానే ఉంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనని కూడా గతంలో కమిట్మెంట్ అడిగారని తెలిపింది.

 

ఇషా కొప్పికర్ మాట్లాడుతూ.. ”నేను కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌లోకి వచ్చాను. ఆ సమయంలోనే సినిమా వకాశాలు వచ్చాయి. కెరీర్‌ మొదట్లోనే నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు. కెరీర్ మొదట్లో ఓ నిర్మాత నుంచి నాకు కాల్‌ వచ్చింది. మేము చేస్తున్న సినిమాలో మిమ్మల్ని హీరోయిన్‌గా అనుకుంటున్నాం. మా హీరోకీ మీరు బాగా నచ్చారు. వీలుంటే ఒకసారి మా హీరోని ఏకాంతంగా కలవండి అని ఆ నిర్మాత నాకు చెప్పాడు. అప్పట్లో నాకు అయన చెప్పిన మాటలు అర్థం కాలేదు.”

Prabhas Marriage : అందుకే నాకింకా పెళ్ళికాలేదు.. పెళ్లిపై స్పందించిన ప్రభాస్

”దీంతో నేనే డైరెక్ట్ గా ఆ హీరోకి కాల్‌ చేశాను. హీరో నాతో.. మీరు ఒక్కరే ఒంటరిగా నా దగ్గరికి రండి. మీ స్టాఫ్‌ని తీసుకురాకండి అన్నారు. దాంతో అయన మాటలు అర్థమై వెంటనే కాల్ కట్ చేశాను. అప్పుడు ఆ మాటలకు నాకు చాలా బాధగా అనిపించింది. వెంటనే ఆ నిర్మాతకు ఫోన్‌ చేసి నా టాలెంట్‌ని చూసి ఎవరైనా ఆఫర్స్‌ ఇస్తే చేస్తాను, లేకపోతే లేదు. అని చెప్పాను. దీంతో ఆ హీరోని నేను ఒంటరిగా కలవలేదని ఆ సినిమా నుంచి నన్ను తీసేశారు’’ అని తెలిపింది.