Chiranjeevi: నాన్-స్టాప్‌గా కష్టపడుతున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే. ఆయన ఒకేసారి మూడు...

Chiranjeevi: నాన్-స్టాప్‌గా కష్టపడుతున్న మెగాస్టార్!

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే. ఆయన ఒకేసారి మూడు చిత్రాలు కమిట్ కావడంతో, ఈ సినిమా షూటింగ్‌లు ఎప్పటికి పూర్తవుతాయో అని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తారుమారు చేస్తూ, యంగ్ హీరోలకు సవాల్ విసురుతూ చిరంజీవి పడుతున్న కష్టం చూస్తుంటే అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం నోరెళ్లబెడతారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు.

Chiranjeevi: మోహన్ లాల్‌పై పడ్డ చిరంజీవి.. మరోదానికి సై?

ఇప్పటికే ఆయన ముంబైలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి గాడ్‌ఫాదర్ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం నాటితో సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూట్‌తో పాటు ముంబై షెడ్యూల్ కూడా ముగించేశాడు చిరు. ఇక సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న చిరు, మంగళవారం నాడు దర్శకుడు బాబీతో చేస్తున్న సినిమాకు సంబంధించి షూటింగ్‌లో పాల్గొంటారు. అల్యుమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను రాత్రి వేళ జరుపుకోనుంది చిత్ర యూనిట్.

Chiranjeevi : మీతో స్క్రీన్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. సల్మాన్‌పై మెగాస్టార్ ట్వీట్

ఇక ఈ షెడ్యూల్ పూర్తి కాగానే, మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న భోళాశంకర్ చిత్ర షూటింగ్‌ను చిరు తిరిగి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో భోళా శంకర్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వంలో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించి ఆ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు. ఇలా వరుస షెడ్యూల్స్‌తో బ్రేక్ లేకుండా కష్టపడుతున్న చిరంజీవిని చూసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఆయన సినిమాలు చేస్తుండటంతో ఈయేడు చిరంజీవి చిత్రాలు ఎన్ని రిలీజ్ అవుతాయా అని వారు లెక్కలు వేస్తున్నారు. కాగా చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.