Chiranjeevi: మోహన్ లాల్‌పై పడ్డ చిరంజీవి.. మరోదానికి సై?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన పలు రీమేక్ చిత్రాలనే ఎక్కువగా తెరకెక్కిస్తున్నాడు.....

Chiranjeevi: మోహన్ లాల్‌పై పడ్డ చిరంజీవి.. మరోదానికి సై?

Chiranjeevi Keen To Remake Bro Daddy Movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన పలు రీమేక్ చిత్రాలనే ఎక్కువగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో తెరకెక్కిస్తున్న చిరు, ఆ తరువాత తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘వేదాళం’ను ‘భోళా శంకర్’ పేరుతో రెడీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలపై చిరు పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.

అయితే ఈ సినిమాలే కాకుండా తాజాగా మరో రీమేక్ చిత్రంపై చిరు కన్నేసినట్లు తెలుస్తోంది. మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ‘బ్రో డాడీ’ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించాలని చిరు భావిస్తున్నాడట. ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ కలిసి నటించగా, ఈ సినిమాకు క్రిటిక్స్ ప్రశంసలు కూడా దక్కాయి. ఇలా వరుసగా మలయాళంలో మోహన్ లాల్ నటించిన సినిమాలపై చిరంజీవి కన్నేడయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Chiranjeevi: జుహూ బీచ్‌లో ‘భోళాశంకర్’.. అదిరిందంటున్న ఫ్యాన్స్!

వరుసగా మోహన్ లాల్ నటించిన సినిమాలనే చిరు ఎందుకు టార్గెట్ చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే మోహన్ లాల్ ఎంచుకునే సినిమాల్లో కథ చాలా బలంగా ఉండటమే కాకుండా కమర్షియల్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో ఆ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు వసూళ్ల పరంగానూ మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. దీంతో చిరంజీవి కూడా తన అభిమానుకు అన్ని విధాలా నచ్చే సినిమాలను తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

కొత్త ప్రయోగాలకు తావివ్వకుండా, ఇతర భాషల్లో సూపర్ సక్సెస్ అయిన సినిమాలను తెలుగులో తీసి ఇక్కడ కూడా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. మరి మోహన్ లాల్ తీసే సినిమాలే కాకుండా ఇతర స్టార్ హీరోలు తీసే సినిమాలను కూడా చిరంజీవి పట్టుకొస్తే బాగుంటుందని ఆయన అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో రీమేక్ సినిమాలకు చిరంజీవి ఇస్తున్న ఇంపార్టెన్స్ మంచిదని పలువురు కామెంట్ చేస్తున్నారు.