Chiranjeevi: జుహూ బీచ్‌లో ‘భోళాశంకర్’.. అదిరిందంటున్న ఫ్యాన్స్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళా శంకర్’ కూడా ఒకటి. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా....

Chiranjeevi Bholaa Shankar Vibe At Juhu Beach Mumbai
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళా శంకర్’ కూడా ఒకటి. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో టాలీవుడ్‌లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ కొంతమేర ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, వైబ్ ఆఫ్ భోళా టీజర్‌లు చూశాక వారు ఈ సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘వైబ్ ఆఫ్ భోళా’ టీజర్ వీడియోను ముంబైలోని జుహూ బీచ్‌లోని సముద్రంలో ఓ షిప్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఇలా సముద్రంలో ఓ సినిమాకు సంబంధించిన వీడియోను ప్లే చేయడం ఇదే తొలిసారి అంటున్నారు చిత్ర యూనిట్. ఇక జుహూ బీచ్‌లో ‘వైబ్ ఆఫ్ భోళా’ను చూస్తూ అక్కడి జనం ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తన సోషల్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
ఇది మెగాస్టార్ క్రేజ్‌కు నిదర్శనం అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. కాగా ఈ తరహాలో మునుపెన్నడూ ఓ హీరో సినిమాకు సంబంధించిన వీడియోను ప్లే చేయలేదని వారు అంటున్నారు. ఇక భోళాశంకర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరు సోదరి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తుండగా స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు.
Bholaa Shankar : చిరు సినిమాలో రష్మి స్పెషల్ సాంగ్..
కాగా చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉండగానే, భోళా శంకర్‌తో పాటు గాడ్‌ఫాదర్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్ జరుపుకుంటుండగా, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు మరో దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన కథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి భోళా శంకర్ చిత్రంతో మెగాస్టార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.