Diseases : జబ్బులు.. ముందస్తు హెచ్చరికలు!

చేతి వేళ్లు, గోళ్లు ఉబ్బినట్లు, వంకర్లు తిరిగినట్లు కనిపిస్తే అందుకు రక్తంలో ఆక్సిజన్ లేమి కారణమని గుర్తించాలి. దీని వల్ల ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

Diseases : జబ్బులు.. ముందస్తు హెచ్చరికలు!

Diseases .. Early Warnings

Diseases : మనిషి శరీరం ఎప్పుడు ఎలాంటి వ్యాధుల భారిన పడుతుందో ఎవరూ చెప్పలేరు. మనం తీసుకునే ఆహారం, వాతావరణం, అలవాట్లు వ్యాధుల సంక్రమణపై కొంతమేర ప్రభావం చూపిస్తాయి. పోషకాహారం లోపించటం, శుభ్రత పాటించకపోవటం వంటి కొన్ని కారణాల వల్ల కొన్ని రకాల జబ్బులు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. అయితే జబ్బులు వచ్చే ముందు కొన్ని రకాల సూచనలు ముందస్తుగానే శరీరంలో కనిపిస్తాయి. వీటి అధారంగా ముందుగానే కనిపెట్టి తగిన చికిత్స చేయించుకోవటం ద్వారా వాటి నుండి బయటపడేందుకు, ప్రమాదకరమైన పరిస్ధితులు ఎదురుకాకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఉదయం నిద్రలేస్తూనే నీరసం, తలనొప్పి సమస్యలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. వాతావరణం , పరిసరాల్లో కార్పన్ మోనాక్సైడ్ విష ప్రభావం కారమై ఉండొచ్చేమో నిర్ధారించుకోవాలి. రొమ్ము ప్రాంతంలో చర్మం పొడిబారటం, దద్దుర్లు వంటి కనిపించటం, సాధారణ చికిత్సకు తగ్గుకపోవటం వంటివి గమనిస్తే వెంటనే వైదులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది. ఎందుకంటే ఈలక్షణాలు రొమ్ము క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి.

చేతి వేళ్లు, గోళ్లు ఉబ్బినట్లు, వంకర్లు తిరిగినట్లు కనిపిస్తే అందుకు రక్తంలో ఆక్సిజన్ లేమి కారణమని గుర్తించాలి. దీని వల్ల ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యుని సంప్రదించటం మేలు. చర్మంపై దురుద అలెర్జీ కారణంగా వస్తుంది. దీంతో పాటు కామెర్లూ, శారీరక అలసట ఉంటే మాత్రం అది కాలేయానికి సంబంధించి సమస్యగా గుర్తించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలి.

కాలి పాదాలకు ఏదైనా ప్రదేశంలో చిన్న దెబ్బతగిలితే రెండు మూడు రోజుల్లో తగ్గితే ఇబ్బంది లేదు. అలా కాకుండా పుండు మానకుండా దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఎందుకంటే మధుమేహం ఉన్నవారిలో పండ్లు ఒకపట్టాన మానవు. చివరకు కాళ్లు, వేళ్లు తీసేయాల్సిన పరిస్ధితికి దారి తీస్తాయి. కాబట్టి చిన్న పుండ్లే కదా అని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తగిన చికిత్స పొందటం మంచిది.