Mamata Banerjee: స్వయంగా టిబెటన్ మోమోలు చేసిన సీఎం మమతా బెనర్జీ.. వీడియో
ఇటీవలే పానీపూరీ చేసి ఆకట్టుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు స్వయంగా టిబెటన్ మోమోలు చేశారు. ఆమె మోమోలు చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Mamata Banerjee: ఇటీవలే పానీపూరీ చేసి ఆకట్టుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు స్వయంగా టిబెటన్ మోమోలు చేశారు. ఆమె మోమోలు చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Maharashtra: పెట్రోల్‌పై లీటరుకు రూ.5 వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర కొత్త సీఎం షిండే
డార్జిలింగ్‌లోని ఓ చిన్న వంటగదిలో కూర్చున్న మమతా బెనర్జీ స్వయంగా మోమోలు చేశారు. స్థానికంగా మోమోలు అమ్మే వ్యక్తులతో ఆమె మాట్లాడారు. ఆ ప్రాంతంలో టిబెటన్ మోమోలకు మంచి గిరాకీ ఉంటుంది. అలాగే, అక్కడి స్వయం సహాయక బృందాలతో మాట్లాడి వారి సమస్యల గురించి మమతా బెనర్జీ తెలుసుకున్నారు. గతంలోనూ మమతా బెనర్జీ ఇలా ప్రజలతో మమేకమై వారి సమస్యల గురించి తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి.
A leader of the masses and with the masses!
Hon’ble Chairperson @MamataOfficial is seen with the locals of Darjeeling wrapping dumplings.The heartwarming visuals remind us that our leader is not someone who sits in ivory towers, but who is a part of every family of Bengal. pic.twitter.com/8FdNLhV9at
— All India Trinamool Congress (@AITCofficial) July 14, 2022