Maharashtra: పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5 వ్యాట్ త‌గ్గించిన మ‌హారాష్ట్ర కొత్త సీఎం షిండే

సామాన్యుడికి భార‌మైపోయిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో మ‌హారాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను త‌గ్గించారు. పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5, డీజిల్‌పై లీట‌రుకు రూ.3 త‌గ్గిస్తున్న‌ట్లు ఆయ‌న ఇవాళ‌ ప్ర‌క‌టించారు.

Maharashtra: పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5 వ్యాట్ త‌గ్గించిన మ‌హారాష్ట్ర కొత్త సీఎం షిండే

Eknath Shinde Orders So Protocal To His Convoy

Maharashtra: సామాన్యుడికి భార‌మైపోయిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో మ‌హారాష్ట్ర కొత్త ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను త‌గ్గించారు. పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5, డీజిల్‌పై లీట‌రుకు రూ.3 త‌గ్గిస్తున్న‌ట్లు ఆయ‌న ఇవాళ‌ ప్ర‌క‌టించారు. మంత్రాల‌య‌లో ఇవాళ షిండే నేతృత్వంలో కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఇందులో పెట్రోల్‌, డీజిల్ వ్యాట్‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఈ నిర్ణ‌యం ద్వారా రాష్ట్ర ఖ‌జానాపై రూ.6,000 కోట్ల భారం ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

Gardening: తోట‌పని చేస్తే మాన‌సిక ఆరోగ్యం

ఈ సంద‌ర్భంగా డిప్యూటీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ మాట్లాడుతూ… శివ‌సేన‌-బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం విష‌యంలో ఎంత నిబద్ధ‌త‌తో ఉందో తాము తీసుకున్న ఈ నిర్ణ‌యం ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని అన్నారు. కాగా, పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌తో పాటు మ‌హారాష్ట్రకు సంబంధించిన ప‌లు కీల‌క నిర్ణ‌యాలను కేబినెట్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే తీసుకున్నారు. ఈ స‌మావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై మంత్రుల నుంచి ఆయ‌న సూచ‌న‌లు తీసుకున్నారు.