Russia vs Ukraine War: యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా ..

యుక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం ఉదయం వరుస క్షిపణి దాడుదలతో నగరంలోని పలు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. దట్టమైన పొగ కమ్ముకోవటంతో ప్రజలు భయంతో వణికిపోయారు.

Russia vs Ukraine War: యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా ..

Russia vs Ukrian war

Russia vs Ukraine War: యుక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా వదులుతున్న వరుస క్షిపణులతో యుక్రెయిన్‌లోని ప్రజలు వణికిపోతున్నారు. సోమవారం ఉదయం యుక్రెయిన్ రాజధాని కీవ్ లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని రాయిటర్స్ నివేదించింది. ఉత్తర, తూర్పు, మధ్య యుక్రెయిన్‌లోని ప్రాంతీయ అధికారులుకూడా క్షిపణి దాడులను నివేదించారు. అయితే కైవ్ లో పేలుళ్లకు కారణం తెలియరాలేదు.

Russia-Ukraine War..’dirty bomb’ : డర్టీ బాంబ్ అంటే ఏంటి? ఈ బాంబులను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్‌రప్షన్‌గా ఎందుకు అంటారు? వీటి ప్రభావం ఎలా ఉంటుంది..?

క్రిమియా వంతెనపై బాంబు పేలుళ్ల తరువాత రష్యా యుక్రెయిన్‌పై క్షిపణి దాడులను వేగవంతం చేసింది. తాజాగా సోమవారం సుమారు పది కంటే ఎక్కువ పేలుళ్లు సంభవించాయని, పేలుళ్లు తరువాత నగరాన్ని దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు స్థానికులు తెలినట్లు రాయిటర్స్ పేర్కొంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లదాటికి విద్యుత్ ప్లాంట్లతోపాటు మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు పడిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

ఖార్కివ్ మేయర్ ఇహెర్ టెరెఖోవ్ మాట్లాడుతూ.. రెండు క్షిపణులు నగరాన్ని దెబ్బతీశాయని, జపోరిజ్జియా,చెర్కాసీ నగరాల్లో కూడా పేలుళ్లు సంభవించాయని తెలిపారు.