Russia-Ukraine War..’dirty bomb’ : డర్టీ బాంబ్ అంటే ఏంటి? ఈ బాంబులను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్‌రప్షన్‌గా ఎందుకు అంటారు? వీటి ప్రభావం ఎలా ఉంటుంది..?

రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగే పరిస్థితి లేదు. పైగా.. కొత్త కొత్త ఆయుధాలు వాడుతున్నారు. యుక్రెయిన్ కూడా తమపై.. డర్టీ బాంబ్ ప్రయోగించే ఆలోచనతో ఉందని.. రష్యా ఆరోపిస్తోంది. అసలు డర్టీ బాంబ్ అంటే ఏంటి? ఈ బాంబులను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్‌రప్షన్‌గా ఎందుకు అంటారు? వీటి ప్రభావం ఎలా ఉంటుంది..?

Russia-Ukraine War..’dirty bomb’ : డర్టీ బాంబ్ అంటే ఏంటి? ఈ బాంబులను వెపన్స్ ఆఫ్ మాస్ డిస్‌రప్షన్‌గా ఎందుకు అంటారు? వీటి ప్రభావం ఎలా ఉంటుంది..?

Russia-Ukraine War..'dirty bomb'

Russia-Ukraine War..’dirty bomb’ : రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆగే పరిస్థితి లేదు. పైగా.. కొత్త కొత్త ఆయుధాలు వాడుతున్నారు. యుక్రెయిన్ కూడా తమపై.. డర్టీ బాంబ్ ప్రయోగించే ఆలోచనతో ఉందని.. రష్యా ఆరోపిస్తోంది. ఈ ఆయుధాల వాడకం.. ఎక్కడికి దారితీస్తుందన్నదే ఇప్పుడు ఆందోళన రేపుతోంది. ఈ వార్.. ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. కంటికి కనిపించిన ఆయుధాలన్నీ వాడుకుంటూ పోతే.. పరిస్థితేంటి?

రష్యా సైన్యం తమపై సూసైడ్ డ్రోన్లకు ప్రయోగిస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. మరోవైపు.. యుక్రెయిన్ తమపై డర్టీ బాంబ్‌ను వాడాలని చూస్తోందని.. రష్యా చెబుతోంది. దీంతో.. పరిస్థితులు మరింత దిగజారాయ్. రష్యా డిఫెన్స్ మినిస్టర్ సెర్గీ షోయిగు.. తాజాగా బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలేస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. యుక్రెయిన్ డర్టీ బాంబ్‌ని ఉపయోగించడం ద్వారా.. తమను రెచ్చగొట్టే అవకాశం ఉందని.. ఈ విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని చెప్పారు. అలాగే.. అమెరికా, ఫ్రాన్స్‌ దేశాల రక్షణ మంత్రులతోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చివరికి.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ రష్యా ఇవే ఆరోపణలు చేసింది. డర్టీ బాంబును ఉపయోగించటం.. అణు ఉగ్రవాద చర్యే అవుతుందని తెలిపింది. అయితే.. రష్యా ఆరోపణలను.. యుక్రెయిన్ సహా ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులు కొట్టిపారేశారు. ఈ యుద్ధంలో.. చెత్త అంతా రష్యా నుంచే పుట్టుకొస్తుందని.. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఫైర్ అవుతున్నారు.

Russia-Ukraine Drone War : యుద్ధం తీవ్రతరం .. కామికాజి డ్రోన్లతో విరుచుకుపడతున్న రష్యా .. డర్టీ బాంబ్ ప్రయోగిస్తామంటున్న యుక్రెయిన్

డర్టీ బాంబు అంటే ఏమిటి..?
మామూలు పేలుడు పదార్థాలతో పాటు అణుధార్మిక పదార్థాలు కూడా కలిపి ఉండే బాంబునే.. డర్టీగా బాంబుగా పిలుస్తారు. ఇందులో.. సంప్రదాయ పేలుడు పదార్థాలతో పాటు యురేనియం కూడా కలిపి ఉంటుంది. అది పేలినప్పుడు.. వాటితో పాటు ఉన్న అణుధార్మిక పదార్థం గాలిలో వ్యాపిస్తుంది. ఈ డర్టీ బాంబ్ తయారీకి.. న్యూక్లియర్ బాంబుల్లో ఉపయోగించే తరహా.. అత్యంత శుద్ధి చేసిన అణుధార్మిక పదార్థం అవసరం లేదు. ఆస్పత్రులు, అణు విద్యుత్ ప్లాంట్లు, రీసెర్చ్ లేబోరేటరీల్లో ఉండే అణుధార్మిక పదార్థాలను వాడి.. డర్టీ బాంబ్‌ని తయారుచేస్తారు. అణ్వాయుధాల కన్నా చాలా చౌకగా.. చాలా వేగంగా.. దీనిని తయారుచేయొచ్చు. వాహనాల్లోనూ తీసుకెళ్లొచ్చు.

డర్టీ బాంబులను.. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్‌రప్షన్‌గా ఎందుకంటారు?
ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ సంస్థ లెక్కించిన దాని ప్రకారం.. 9 గ్రాముల కోబాల్ట్-60ని, ఐదు కిలోల టీఎన్‌టీని కలిపి పేల్చితే.. న్యూయార్క్ నగరం మొత్తం దశాబ్దాల పాటు నివాసానికి పనికి రాకుండా పోతుంది. అందుకే.. డర్టీ బాంబులను.. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్‌రప్షన్‌గానూ పిలుస్తారు. ఇలాంటి బాంబ్‌ని.. యుక్రెయిన్ తమపై ప్రయోగించొచ్చని.. రష్యా ఆరోపించడం మీదే.. ఇప్పుడు వరల్డ్ వైడ్ డిబేట్ మొదలైంది. భయం పుట్టించే వాదనలతో.. యుక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు అందిస్తున్న సైనిక సాయాన్ని నిలిపివేసేలా చేయడంతో పాటు నాటో కూటమిని బలహీనపరిచేందుకే.. రష్యా ఇలాంటి ఆరోపణలు చేస్తుండొచ్చని.. అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

డర్టీ బాంబును పేల్చితే ప్రభావం ఎలా ఉంటుంది..?
అయితే.. యుక్రెయిన్‌లో.. రష్యానే ఓ డర్టీ బాంబును పేల్చి.. అది యుక్రెయిన్ బలగాల పనేనని నిందించేందుకు ఫాల్స్ ఫ్లాగ్ దాడికి మాస్కో స్కెచ్ గీస్తోందనే.. ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయ్. అదే జరిగితే.. అణుధార్మికత సోకి.. క్యాన్సర్ లాంటి తీవ్ర జబ్బులు సోకే ప్రమాదం ఉంటుంది. ఆ బాంబ్ పేలిన ప్రదేశంతో పాటు దాని చుట్టూ భారీ విస్తీర్ణంలోని ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించాల్సి వస్తుంది. అయితే.. ఈ చర్య వల్ల తన సొంత సైన్యానికి, తన నియంత్రణలో ఉన్న ప్రాంతానికి జరిగే నష్టం దృష్ట్యా.. రష్యా ఇంత తెలివి తక్కువ పని చేయదని సైనిక విశ్లేషకులు చెబుతున్నారు.

కొత్త కొత్త ఆయుధాలతో కీవ్‌ని నాశనం చేయాలని చూస్తున్న రష్యా..ధీటుగా బదులిస్తున్న యుక్రెయిన్
రష్యా-యుక్రెయిన్ యుద్ధం.. ఈగోల స్థాయిని దాటి ఫ్రస్టేషన్ స్టేజ్‌కు వెళ్లిపోయింది. 8 నెలలవుతున్నా.. యుక్రెయిన్‌పై పుతిన్ పట్టు సాధించలేకపోతున్నారు. ఏదోరకంగా.. ఆ దేశాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు. అందుకే.. కొత్త కొత్త ఆయుధాలతో కీవ్‌ని నాశనం చేయాలని చూస్తున్నారు. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు.. యుక్రెయిన్ కూడా అదే స్థాయిలో ఆలోచిస్తోంది. అయితే.. తాము డర్టీ బాంబ్‌ ప్రయోగించబోతున్నట్లు రష్యా చేసిన ఆరోపణలను.. యుక్రెయిన్ ఖండించింది. కానీ.. అమెరికా సహా ఇతర దేశాల నుంచి వచ్చే అధునాతన ఆయుధాలను.. రష్యాపై ప్రయోగించేదుకు ఏమాత్రం వెనుకాడదు. ఒకరిపై.. ఒకరు పైచేయి సాధించేందుకు జరుగుతున్న ఈ ఆధిపత్యపోరులో.. కొత్త ఆయుధాలను వాడుకుంటూ పోతే.. పరిస్థితులు మరింత దిగజారుతాయ్. ఆ ఇంపాక్ట్.. ప్రపంచ దేశాల పైనా పడుతుంది. రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం.. మూడో ప్రపంచానికి కూడా దారితీసే అవకాశాలున్నాయని.. అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.