Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ సెట్స్‌లో సందడి చేసిన తమిళ హీరో..!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ సెట్స్‌లో తమిళ హీరో శరత్ కుమార్ సందడి చేశారు.
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
Veera Simha Reddy: ఇండియా-బంగ్లా మ్యాచ్‌లో వీరసింహారెడ్డి హవా.. బాలయ్యా మజాకా!
ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో నటిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్ సెట్స్‌లో తమిళ హీరో శరత్ కుమార్ సందడి చేశారు. ఆయన ఈ సినిమా షూటింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతేగాక, బాలయ్య ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద రెచ్చిపోవడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
Veera Simha Reddy: బాలయ్య సినిమాలో ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదట.. ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ..?
దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. శరత్ కుమార్ బాలయ్య సినిమా సెట్స్‌లో సందడి చేయడంతో, దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.