Veera Simha Reddy: బాలయ్య సినిమాలో ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదట.. ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ..?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా వీర సింహా రెడ్డి సినిమాలో వచ్చే ఓ భారీ ట్విస్టుకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ, హీరోయిన్ శ్రుతి హాసన్ పాత్రలకు సంబంధించి ఓ అదిరిపోయే ట్విస్ట్ రివీల్ కానుందని తెలుస్తోంది.

Veera Simha Reddy: బాలయ్య సినిమాలో ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదట.. ఫ్యాన్స్‌కు పూనకాలు గ్యారెంటీ..?

Veera Simha Reddy Movie To Have A Mindblock Interval Twist

Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలయ్య మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టైటిల్ మోషన్ పోస్టర్, వీడియో గ్లింప్స్‌లో బాలయ్య లుక్‌కు అదిరిపోయే క్రేజ్ దక్కింది.

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య వీర బాదుడు మామూలుగా ఉండదట!

అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా వీర సింహా రెడ్డి సినిమాలో వచ్చే ఓ భారీ ట్విస్టుకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ, హీరోయిన్ శ్రుతి హాసన్ పాత్రలకు సంబంధించి ఓ అదిరిపోయే ట్విస్ట్ రివీల్ కానుందని తెలుస్తోంది. ఈ ట్విస్ట్ ప్రేక్షకులు ఏమాత్రం ఊహించని విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

NBK107: బాలయ్య సినిమా శాటిలైట్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్న స్టార్ మా!

ఇక ఈ ట్విస్టుతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆడియెన్స్‌కు సినిమా సెకండాఫ్‌పై రెట్టింపు ఆసక్తిని క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అనేది చూడాలి. కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.