Varanasi Leak: ‘వారణాసి’ నుంచి మళ్ళీ లీక్స్.. ఈసారి కీ సీన్స్ కూడా.. టెన్షన్ లో రాజమౌళి టీం
Varanasi Movie Leaks: రాజమౌళి వారణాసి(Varanasi) సినిమా నుంచి కీలకమైన సెట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu and Rajamouli Varanasi movie shooting pics have been leaked
- ‘వారణాసి’ మూవీ టీం కి షాక్
- ఉగ్రభట్టి గుహ ఫోటోలు లీక్.
- తలలుపట్టుకుంటున్న టీం
Varanasi: సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి(Varanasi)’. ఈ సినిమాను మొదటి నుంచి లీకుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఒడిశాలో జరిగిన తొలి షెడ్యూల్ విశేషాల నుంచి మొదలుకొని, తాజాగా చిత్రంలోని అత్యంత కీలకమైన ‘ఉగ్రభట్టి గుహల’ సెట్ విజువల్స్ వరకు ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడం చిత్రయూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. చిన్నమస్తాదేవి ఉగ్రరూపంలో కొలువుదీరి ఉండే ఈ గుహల సెట్లో ఇటీవల మహేష్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించగా, బ్లూ మ్యాట్ స్క్రీన్‌తో కూడిన ఆ ఫొటోలు సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు రాజమౌళి తదుపరి భారీ షెడ్యూల్‌ను సిద్ధం చేశారు. ఏకంగా నెల రోజుల పాటు సాగే ఈ కొత్త షెడ్యూల్లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్లను తెరకెక్కించబోతున్నారు. దీనికోసం మహేష్ బాబు విదేశాలకు వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నప్పటికీ, అత్యంత ఆసక్తికరమైన అంటార్కిటికా షెడ్యూల్‌ను మాత్రం ప్రస్తుతానికి మరికొన్ని రోజులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ లోపు ఇండియాలోనే లభించే ఇతర ముఖ్యమైన భాగాలను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచే 25 నిమిషాల నిడివి గల రామాయణ యుద్ధ ఘట్టాన్ని ఐమ్యాక్స్ కెమెరాలతో విజువల్ వండర్‌గా షూట్ చేశారు. ఈ అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్లో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించనుండటం విశేషం.
