Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య వీర బాదుడు మామూలుగా ఉండదట!

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో తెరకెక్కుతున్న 107వ సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ నిన్న ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో యాక్షన్ డోస్ మాత్రం ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య వీర బాదుడు మామూలుగా ఉండదట!

Number Of Actions Sequences In Balakrishna Veera Simha Reddy

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో తెరకెక్కుతున్న 107వ సినిమాకు ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ నిన్న ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NBK107: ‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య!

ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలయ్య వైవిధ్యమైన లుక్‌తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆయన లుక్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమాలో యాక్షన్ డోస్ మాత్రం ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.

NBK107: బాలయ్య సినిమాకు ఈ టైటిల్ ఫిక్స్ చేశారా.. నెట్టింట ఒకటే మోత!

ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను కట్టిపడేయనున్నట్లు దర్శకుడు గోపీచంద్ తెలిపాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదకొండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. మరి ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ సీక్వెన్స్‌లు ఎలా ఇరగదీశాడో తెలియాలంటే వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.