Soya Bean : సోయా చిక్కుడు విత్తుకునే విధానం, కలుపు నివారణ పద్దతులు!

సోయా చిక్కుడు పంటను వర్షాధార పంటగా సాగుచేస్తారు. ఈ పంటకు నీటి వినియోగం తక్కువగానే ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉన్న సమయాల్లో నీటిని అందించాలి.

Soya Bean : సోయా చిక్కుడు విత్తుకునే విధానం, కలుపు నివారణ పద్దతులు!

soyabeen

Soya Bean : సోయా చిక్కుడు వేసే ముందు విత్తన సేకరణ చాల ముఖ్యమైనది. మొలక శాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన కొత్త విత్తనాన్ని ఎంచుకోవాలి. పాత విత్తనం అయితే మొలక శాతం తక్కువగా ఉంటుంది దీనివల్ల దిగుబడిపై ప్రభావం పడుతుంది. సోయా చిక్కుడు విత్తనం వేసుకునేప్పుడు నేల తేమగా ఉన్న సమయంలో విత్తుకోవాలి. దీనివల్ల మొలక శాతం పెరుగుతుంది. విత్తనాన్ని శుద్ధి చెయ్యడం కోసం 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల తైరం మరియు 3 గ్రాముల కాప్టన్ లను విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 40 cm, మొక్కల మధ్య దూరం 8 cm ఉండేలా చూసుకొని విత్తుకోవాలి.

విత్తుకున్న 48 గంటలలోపు 1 లీటర్ నీటికి 5 ml పెండిమిథాలిన్ కలుపుకొని నేల మొత్తం తడిచేలా పిచికారి చేసుకోవాలి. మొక్కలు ఎదుగుతున్న సమయంలో గుంటుక లేదా గోర్రుతో అంతర కృషి ద్వారా కలుపును తొలగించాలి. పంట చేనులో గుంటుక లేదా గోర్రులతో దున్నడం వలన మొక్క బలంగా తయారవుతుంది. పంట వయస్సు 30 రోజులు ఉన్న సమయంలో ఎకరానికి 15 – 20 కిలోల యూరియని వేసుకోవాలి.

సోయా చిక్కుడు పంటను వర్షాధార పంటగా సాగుచేస్తారు. ఈ పంటకు నీటి వినియోగం తక్కువగానే ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉన్న సమయాల్లో నీటిని అందించాలి. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న సమయంలో పంట వయస్సు 45 – 50 రోజులకి పూత దశలో మరియు గింజ బలపడే సమయంలో నీటిని కచ్చితంగా అందించాలి. మొక్క ఎదుగుతున్న సమయాల్లో వర్షపాతం తక్కువగా ఉంటె భూమి స్వభవాన్ని బట్టి నీటి తడులను అందించాలి.