Berlin: బెర్లిన్‌లో పేలిపోయిన అతిపెద్ద స్థూపాకార అక్వేరియం.. ఎన్ని లక్షల లీటర్ల కెపాసిటీ అంటే

ప్రపంచంలోనే అతిపెద్ద స్థూపాకార అక్వేరియం పేలిపోయింది. జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ఉన్న అక్వాడోమ్ అక్వేరియం శుక్రవారం ఉదయం పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Berlin: బెర్లిన్‌లో పేలిపోయిన అతిపెద్ద స్థూపాకార అక్వేరియం.. ఎన్ని లక్షల లీటర్ల కెపాసిటీ అంటే

Berlin: జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలోని భారీ అక్వేరియం ఉన్నట్లుండి పేలిపోయింది. ఈ ఘటనలో 1,500 వరకు అరుదైన చేపలు, ఇతర జలచరాలు ప్రాణాలు కోల్పోయాయి. స్థానిక మిట్టె జిల్లాలో ఉన్న ఈ అతిపెద్ద అక్వేరియం శుక్రవారం ఉదయం పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

ఈ అక్వేరియం చాలా అరుదైంది. స్థూపాకారంలో… అంటే నిలువుగా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద అక్వాడోమ్ అక్వేరియం ఇదే. దీని సామర్ధ్యం లక్ష లీటర్లు. ఇది 14 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ అక్వేరియం సందర్శించేందుకు నిత్యం వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఇందులో 1,500 వరకు అరుదైన చేపలు, జలచరాలు ఉన్నాయి. అయితే, శుక్రవారం ఉన్నట్లుండి అక్వేరియం భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో గాజు ముక్కలు, చేపలు, జలచరాలు చాలా దూరం ఎగిరిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే వాటిలో చాలా చేపలు మరణించాయి. ముక్కలైన అక్వేరియం భాగాలు చాలా దూరంలో ఎగిరిపడ్డాయి.

India vs Bangladesh: మూడో రోజు ఆట పూర్తి.. పూజారా, గిల్ సెంచరీలు.. బంగ్లాదేశ్ లక్ష్యం 513

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాజు ముక్కలు గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టతా లేదు. ప్రమాదవశాత్తు జరిగిందా… లేక కుట్రా అనే విషయం తేలాల్సి ఉందని అధికారులు అన్నారు.