Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

యుక్రెయిన్‌పై రష్యా మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌తోపాటు, క్రివ్యి రిహ్, ఖార్కివ్ నగరాలపై రష్యా మిస్సైల్ దాడులు చేస్తోంది. ఈ విషయాన్ని యుక్రెయిన్‌ వెల్లడించింది.

Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

Russia: రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. యుక్రెయిన్‌పై రష్యా ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా యుక్రెయిన్‌లోని కీలక నగరాలపై మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతోంది రష్యా. శుక్రవారం ఉదయం నుంచి యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌తోపాటు, క్రివ్యి రిహ్, ఖార్కివ్ నగరాలపై రష్యా మిస్సైల్ దాడులు చేస్తోంది.

Uganda: రెండేళ్ల చిన్నారిని అమాంతం మింగేసిన హిప్పో.. అయినా బతికిన చిన్నారి.. ఎలా జరిగిందంటే

ఈ విషయాన్ని యుక్రెయిన్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఈ నగరాలు బాంబుల భయంతో, సైరన్ల మోతతో వణికిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితులున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ నగరాల్ని రష్యా చాలా వరకు ధ్వంసం చేసింది. ఖార్కివ్ నగరంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. దీంతో చాలా రోజులుగా ఈ నగరం విద్యుత్ లేకుండా చీకట్లోనే మగ్గుతోంది. రష్యా పవర్ గ్రిడ్ వ్యవస్థలపై దాడులు చేసి, వాటిని ధ్వంసం చేయడంతో యుక్రెయిన్‌లో అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అసలే చలితో వణుకుతున్న ప్రజల్ని ఈ పరిణామం మరింత కలవరపెడుతోంది. మరోవైపు జనావాసాలపై కూడా రష్యా దాడులు చేస్తోంది. క్రివ్యి రిహ్ పట్టణంలోని ఒక అపార్టుమెంట్‌పై రష్యా బాంబు దాడి చేయడంతో ఆ బిల్డింగ్ ధ్వంసమైంది.

Auto Driver Pushes Mercedes Benz : నడిరోడ్డుపై మొండికేసిన బెంజ్ కారు .. కాలితో తోసుకెళ్లిన ఆటో డ్రైవర్

శిథిలాల్లో చాలా మంది చిక్కుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వాళ్లు చెప్పారు. నివాస ప్రాంతాలపై కూడా రష్యా దాడులు చేస్తుండటంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ దాడుల్లో పిల్లలు, మహిళలు గాయపడ్డారు. రష్యా-క్రిమియాను కలిపే బ్రిడ్జిపై యుక్రెయిన్ చేసిన దాడికి నిరసనగా, రష్యా ఈ దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది.