Auto Driver Pushes Mercedes Benz : నడిరోడ్డుపై మొండికేసిన బెంజ్ కారు .. కాలితో తోసుకెళ్లిన ఆటో డ్రైవర్

నడిరోడ్డుపై మొండికేసింది ఓ బెంజ్ కారు .. కాలితో తోసుకుంటూ గెంటుకెళ్లాడు ఓ ఆటో డ్రైవర్. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Auto Driver Pushes Mercedes Benz : నడిరోడ్డుపై మొండికేసిన బెంజ్ కారు .. కాలితో తోసుకెళ్లిన ఆటో డ్రైవర్

Auto Driver Pushes Mercedes Benz

Auto Driver Pushes Mercedes benz : అదో బెంజ్‌ కారు. మామూలు బెంజ్ కారు కాదు మెర్సిడెస్‌ బెంజ్‌ కారు. కానీ నడిరోడ్డుమీద ఉన్నట్టుండి ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కదల్లేదు. దీంతో కారు నడిపే ఎంత ట్రై చేసినా ఉహూ..కదలనే కదలనంది. బండి కాదు మొండి ఇది సాయం పట్టండి ఓ తోపు తోసి పుణ్యం కట్టుకోండి అన్నట్లుగా తయారైంది. ఏ వాహనం అయినా నడిరోడ్డుమీద ఆగిపోతే ఎలాఉంటుందంటే..వెనకాల వచ్చే వాహనాలు కయ్ కయ్ మంటూ హారన్లు కొట్టేస్తుంటాయి. కానీ అవేవీ కారుకు తెలియదు కదా..పాపం పోని రోడ్డు పక్కకు పోనిచ్చి ప్రాబ్లమ్ ఏదో చూద్దామంటే కూడా కారు కదలాలిగా..కానీ ఆ బెంజ్ కారు కాదు కాదు మెర్సిడెస్ బెంజ్ కారు నడిపే వ్యక్తి పాపం అసహయంగా ఏం చేయాలో తోచక అలా ఉండిపోయాడు.

బంగారు కంచానికైనా గోడ చేర్పు కావాలంటారు కదా పెద్దలు..అదే జరిగింది ఈ మెర్సిడెస్ బెంజ్ కారు విషయంలో. ఓ ఆటో డ్రైవర్ ఆ బెంజ్ కారును కాలితో తోచుకుంటూ వెళ్లాడు. దీనికి సంబందించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఆటో డ్రైవర్‌ తన ఆటోను నడుపుతూనే ఓ కాలితో బెంజ్‌ కారును షెడ్డుదాకా కాలితో తోసుకుంటూ వెళ్లాడు.

పూణెలోని కోరేగావ్‌ పార్క్‌ ఏరిలో బిజీగా ఉండే రోడ్డుపై ఓ బెంజ్‌ కారు బ్రేక్‌ డౌన్‌ అయ్యి ఆగిపోయింది. డ్రైవర్‌ ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్‌ అవ్వలేదు. దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఎవరైనా సహాయం చేస్తారేమోనని చూశాడు. కానీ ఎవరి బిజీలో వారు వారి పనులపై వారు వెళ్లిపోతున్నారు. అదే సయమంలో దేవుడిలా వచ్చాడా ఆటో డ్రైవర్. బెంజ్ కారు పరిస్థితిని గమనించి సాయం చేస్తానన్నాడు. అదే భాగ్యం అనుకున్నాడు అతను.వెనుక ఆటో నడుపుతూ తన కాలితో బెంజ్‌కారును తోసుకుంటూ షెడ్డుదాగా చేర్చాడు.

ఇదండీ మెర్సిడెస్ బెంజ్ కారు పరిస్థితి..ఎన్ని లక్షలు, కోట్ల రూపాయాలు పెట్టి కొన్నా ఒక్కోసారి ఇటువంటి పరిస్థితి తప్పదు. ఈ తతంగాన్నంతా రోడ్డుపై వెళ్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయటంతో అది కాస్తా  వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆటో డ్రైవర్‌ను మెచ్చుకుంటున్నారు.