Uganda: రెండేళ్ల చిన్నారిని అమాంతం మింగేసిన హిప్పో.. అయినా బతికిన చిన్నారి.. ఎలా జరిగిందంటే

హిప్పో పోటమస్ ఒక రెండేళ్ల చిన్నారిని అమాంతం మింగేసేందుకు ప్రయత్నించింది. ఒంటరిగా ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని సగానికిపైగా మింగేసింది. అయినా, చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

Uganda: రెండేళ్ల చిన్నారిని అమాంతం మింగేసిన హిప్పో.. అయినా బతికిన చిన్నారి.. ఎలా జరిగిందంటే

Uganda: హిప్పో పోటమస్ (నీటి ఏనుగు) ఎంత పెద్దగా ఉంటుందో తెలిసిందే. ఇది చాలా బలం కలిగిన, ప్రమాదకరమైన జంతువు. చాలా మంది ఈ జంతువును చూస్తేనే భయపడతారు. తాజాగా ఈ జంతువు రెండేళ్ల చిన్నారిని అమాంతం మింగేసింది. అయినా.. ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన ఇటీవల ఉగాండాలో జరిగింది.

Komatireddy VenkatReddy Meets PM Modi : ప్రధానితో చర్చించిన అన్ని విషయాలు చెప్పలేను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఉగాండాలోని కత్వే కబాతోరొ పట్టణంలోని తన ఇంటి దగ్గర రెండేళ్ల చిన్నారి ఆడుకుంటున్నాడు. ఈ ఇల్లు ఒక నదీ తీరంలో ఉంది. చిన్నారి ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఆకలితో ఉన్న ఒక హిప్పో, నదిలోంచి అక్కడికొచ్చి చిన్నారిని అమాంతం మింగేసేందుకు ప్రయత్నించింది. తన రెండు దవడల మధ్య పెట్టుకుని, చిన్నారిని మింగేసేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న మరో చిన్నారి రాళ్లతో కొట్టింది. అప్పటికే సగానికి పైగా బాలుడ్ని మింగేసింది. అయితే, గట్టిగా అరుస్తూ, రాళ్లతో కొట్టడంతో మింగేసిన చిన్నారిని హిప్పో వదిలేసింది. చిన్నారిని వాంతి చేసింది. దీంతో చిన్నారి గాయాలతో బయటపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి బాలుడు క్షేమంగానే ఉన్నాడు.

పక్కనున్న చిన్నారి సమయానికి స్పందించడం వల్ల రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. పక్కనున్న నదీ తీరంలో అనేక హిప్పోలు, మొసళ్లు ఉంటాయని, అలాగే అటవీ ప్రాంతం నుంచి జంతువులు కూడా రావొచ్చని, అందువల్ల స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.