Komatireddy VenkatReddy Meets PM Modi : ప్రధానితో చర్చించిన అన్ని విషయాలు చెప్పలేను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ 20 నిమిషాలు జరిగింది. వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారిన క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానితో చర్చించిన అన్ని విషయాలు చెప్పలేను అంటూ కొన్నివిషయాలను వెల్లడించారు.

Komatireddy VenkatReddy Meets PM Modi : ప్రధానితో చర్చించిన అన్ని విషయాలు చెప్పలేను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy VenkatReddy Meets PM Modi

Komatireddy Venkat Reddy meets PM Modi : ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ 20 నిమిషాలు జరిగింది. వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆఖరికి గత మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనకుండా విదేశాలకు చెక్కేశారు. అక్కడనుంచి పలు స్టేట్ మెంట్లు ఇచ్చారు. పలుమార్లు ఎమ్మెల్యేగా చేశాను..ఎంపీగాను చేశాను అవసరమైతే రాజకీయాల నుంచి తప్పించుకుంటాను అంటూ వెల్లడించారు. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇలా ఒక్కోసారి ఒక్కో స్టేట్ మెంట్స్ ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారతారని తమ్ముడు రాజగోపాల్ రెడ్డిలాగానే బీజేపీలో చేరతారంటూ వార్తలు వచ్చాయి.

ఈక్రమంలో ప్రధాని మోడీతో వెంకట్ రెడ్డి భేటీ అవ్వటం సహజంగానే ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానితో 20నిమిషాలు భేటీ అయిన వెంకట్ రెడ్డి తాను ప్రధానితో చర్చించిన అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ప్రధాని మోడీతో చాలా విషయాలు చర్చించానని చర్చించిన విషయాల్ని అన్ని విషయాలు చెప్పలేనని కొన్ని మాత్రం చెబుతానంటూ నర్మగర్భంగా మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ప్రధానితో చర్చించిన కొన్ని అంశాలను వెల్లడించారు. నా నియోజవర్గంలో అభివృద్ధితో పాటు రాష్ట్ర సమస్యలపై చర్చించానని…అలాగే మూసీనది ప్రక్షాళన గురించి కూడా చర్చించానని తెలిపారు. మూసీ నది వల్ల కోటిమందికిపై ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే ఎంఎంటీఎస్ ను యాదాద్రి వరకు పొడిగించాలని.. భువనగిరి కోటకు రోప్ వే ఏర్పాటు చేయాలని..రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్న ఆయన.. జనగాం, భువనగిరి మధ్య ఎంఎంటీస్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరానని వెంకట్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలో తనకు చోటు దక్కలేదని తాను బాధపడటంలేదని తెలిపిన వెంకట్ రెడ్డి వచ్చే ఎన్నికల ముందు నా భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాను అంటూ వెల్లడించారు. దీనికి బట్టి చూడగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మార్పు మాత్రం ఖాయం అని తెలుస్తోంది. పార్టీ మారేది లేదని మాత్రం ఆయన ఎక్కడా చెప్పలేదు.

కాగా కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరీ చెప్పాలంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కోమరెడ్డి బ్రదర్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే వారిలో ఒకరికైనా పీసీసీ పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ కొత్త పార్టీలోకి వచ్చిన రేవంత్ దూకుడు గుర్తించిన అధిష్టానం ఎవ్వరూ ఊహించిని విధంగా పీసీసీ పదవి కట్టబెట్టింది. దీంతో సహజంగానే తెలంగాణ కాంగ్రస్ నేతలు అసంతృప్తులు, ఆగ్రహాలు వ్యక్తంచేశారు. అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయటం ఇష్టంలేని కోమటిరెడ్డి బద్రర్స్ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారు. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన మీటింగులకు కూడా హాజరయ్యేవారుకాదు. అయిన రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతూ కోమటిరెడ్డి బ్రదర్స్ ను లెక్కచేయకపోవటంతో వీరి మధ్య దూరం మరింతగా పెరిగింది.ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటం కూడా జరిగింది.

ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి పలు నాటకీయ పరిణామాలతో మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తన తమ్ముడి బాటలోనే వెంకట్ రెడ్డి కూడా పయనిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం ఎటూ చెప్పకుండా విదేశాలకు వెళ్లిపోయి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి డుమ్మా కొట్టారు. బీజేపీ నుంచి పోటీ చేసే తన తమ్ముడిని గెలిపించాలని మునుగోడు కాంగ్రెస్ పార్టీ నేతలను వెంకట్ రెడ్డి బెదరించారనే వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి బీజేపీ తరపు నుంచి మునుగోడులో పోటీ చేసి ఓడిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.



కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీట్ పీఎం మోడీ