ఇది విన్నారా! ఆడియో బుక్స్ ఫ్రీ.. లాగిన్ అవడమే ఆలస్యం

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 10:01 AM IST
ఇది విన్నారా! ఆడియో బుక్స్ ఫ్రీ.. లాగిన్ అవడమే ఆలస్యం

Audible అనే సంస్థ ఆడిబుల్ స్టోరీలు ప్రతి ఒక్కరి వద్దకూ తీసుకెళ్లే ఆలోచనతో సరికొత్త ఆఫర్ తెచ్చింది. 200కు పైగా ఆడియో పుస్తకాలను ఫ్రీగా అందించనుంది. పుస్తకం పట్టుకుని చదవాలనుకుని బద్ధకంతో వదిలేసేవారికి ఇది సూపర్ టెక్నిక్. దీని కోసం ఎటువంటి లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ అవసర్లేదు. అలా అని ఇదేదో ఫ్రీ ట్రయల్ ఏం కాదు. ఇది పూర్తిగా ఉంచితం. ఈ వెబ్ సైట్ లో దొరికే ప్రతి పుస్తకాన్ని నేరుగా ఓపెన్ చేసి ఆడియో ద్వారా వినవచ్చు. పైగా దానికి లిమిట్ కూడా ఏం లేదు. ఎంతమందైనా సరే లాగిన్ అవడం చదువుకోవడమే. 

స్కూల్స్ మూసేసి ఉండడంతో ఇదే సమయమని మేం ఈ ప్రోసెస్ స్టార్ట్ చేశాం. వీటి నిడివి ఆరు భాషల్ల ఉంటుంది. డెస్క్ టాప్, ల్యాప్ టాప్, ఫోన్, టాబ్లెట్ ఎందులో అయినా ఓపెన్ చేసి వినవచ్చు. లాక్ డౌన్ సమయంలో కుటుంబమంతా వినడానికి లేదా స్కూల్ సబ్జెక్ట్స్ కంటే ఇతర అంశాలపై ఆసక్తి ఉన్న పిల్లలకు ఇవి హెల్ప్ అవుతాయి. ఎప్పుడూ స్క్రీన్లనే చూస్తూ చేసే టైం పాస్ కు బ్రేక్ చెప్పేసి ఆడియో బుక్స్ పై ఫోకస్ పెట్టేయొచ్చు.

అంటే ఇవి కేవలం చిన్న పిల్లల పుస్తకాలనే కాదు. అడల్ట్స్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్, అలెక్సాల్లో వినే లాంటి స్పష్టమైన గొంతుతో వినవచ్చు. ఈ ప్రకటనను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు. ‘మీరు మీ వాళ్లంతా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నా. మంచి కథ వింటే మంచి భావనలు పొందుతారు’ అని ఆడిబుల్ బుక్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్టు చేసింది. 

చిన్ని కథల నుంచి, పేరెంట్స్, స్కూల్ కు వెళ్లే పిల్లల వయస్సు వరకూ ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గ బుక్స్ దొరుకుతాయి. ఇక మీ అభిలాషకు తగ్గ బుక్  వెతుక్కుని ఎంజాయ్ చేయండి మరి.