Rajinikanth : పవన్ కళ్యాణ్ గురించి.. రజినీకాంత్ సునీల్ కి ఏం చెప్పారో తెలుసా..?
సునీల్ రజినీకాంత్ తో కలిసి కథానాయకుడు సినిమా చేసిన సంగతి తెలిసిందే.(Rajinikanth) సునీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Rajinikanth
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కి తెలుగులో ఎంత మార్కెట్ ఉందో, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమ వ్యక్తులతో కూడా అంతే మంచి అనుబంధం ఉంది. ఇటీవలే రజినీకాంత్ సినీ పరిశ్రమకు వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్ చేయగా రజినీకాంత్ పవన్ ని పొలిటికల్ తూఫాన్ అంటూ అభివర్ణిస్తూ ధన్యవాదాలు తెలిపారు. దాంతో రజినీకాంత్(Rajinikanth) ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ క్రమంలో సునీల్ గతంలో రజినీకాంత్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాడు అని చెప్పిన వీడియో వైరల్ గా మారింది. సునీల్ రజినీకాంత్ తో కలిసి కథానాయకుడు సినిమా చేసిన సంగతి తెలిసిందే.
Also Read : Dharma : సినిమాల్లో హీరోగా సక్సెస్.. పోలీస్ కేసు పెట్టిన భార్య..
సునీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజినీకాంత్ గారితో కథానాయకుడు సినిమా చేస్తున్నప్పుడు జల్సా పేపర్ యాడ్ వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ నా ఫ్రెండ్ కదా. నేను ఆ పేపర్ యాడ్ రజినీకాంత్ కు చూపించి ఈ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ నా ఫ్రెండ్. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యాడు అని చెప్పాను. ఆయన హా త్రివిక్రమ్ తెలుసు అన్నారు. ఆ యాడ్ లో పవన్ కళ్యాణ్ గారి స్టిల్ చూసి ఈయనే తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్, ఓ రేంజ్ కి వెళ్తారు అన్నారు. ఆయనకు అలా ఎలా తెలుసు అని నేను అనుకునేవాడిని అని తెలిపాడు.
కథానాయకుడు, జల్సా రెండు సినిమాలు ఆల్మోస్ట్ ఒకేసారి షూట్ అయి రెండూ 2008 లోనే రిలీజయ్యాయి. కథానాయకుడు యావరేజ్ గా మిగలగా, జల్సా సూపర్ హిట్ అయింది.
Also Read : Rahul Sipligunj : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఫొటోలు చూశారా?