Tamil Film Industry : తమిళ్ లో కమర్షియల్ స్టార్ హీరోలు లేరా.. విజయ్ లాస్ట్ సినిమా అయిపోతే? రజినీకాంత్ ఆపేస్తే ఏంటి పరిస్థితి?
స్టార్ హీరోలు, జనాల్ని కేవలం తమ ఫేస్ తో సినిమాకు రప్పించి కోట్ల కలెక్షన్స్ తెప్పించే హీరోలు అవసరం.(Tamil Film Industry)

Tamil Film Industry
Tamil Film Industry : తమిళనాడులో ఇప్పుడు స్టార్ హీరోలు కరువయ్యారు. వంద కోట్లు తెచ్చే హీరోలు, జనాల్ని అమాంతం థియేటర్స్ కి రప్పించే హీరోలు కరువయ్యారు. సినీ పరిశ్రమలో ఎంత మంచి సినిమాలు వచ్చినా కమర్షియల్, మాస్ సినిమాలు లేకపోతే పరిశ్రమ నడవడం ఆర్థికంగా కష్టమే. అందుకే స్టార్ హీరోలు, జనాల్ని కేవలం తమ ఫేస్ తో సినిమాకు రప్పించి కోట్ల కలెక్షన్స్ తెప్పించే హీరోలు అవసరం.(Tamil Film Industry)
తెలుగులో అలా కోట్ల కలెక్షన్స్, భారీ ఓపెనింగ్స్ తెప్పించే హీరోలు చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండవరకు చాలా మందే ఉన్నారు. మన హీరోల ఫ్లాప్ సినిమాలకు కూడా వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయి. కానీ తమిళ్ లో ఆ రేంజ్ స్టార్ డమ్, కలెక్షన్స్ తెప్పించే హీరోలో ఇద్దరు ముగ్గురే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తప్పుకునే స్టేజ్ లో ఉన్నారు. దీంతో తమిళ్ పరిశ్రమకు కలెక్షన్స్ ఎవరు తెప్పిస్తారు అనే చర్చ మొదలయింది.
Also Read : Sushmita Konidela : మా ఇద్దరి మధ్య గొడవలకు కారణం పవన్ బాబాయే.. చిరు కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు..
తమిళ్ లో విజయ్, రజినీకాంత్ మాత్రమే ఇప్పుడు తమ ప్రతి సినిమాకు భారీ ఓపెనింగ్స్, కోట్లల్లో కలెక్షన్స్ తెప్పిస్తున్నారు. ఈ ఇద్దరి సినిమాలు ఫ్లాప్ అయినా కోట్ల కలెక్షన్స్ తెప్పిస్తున్నారు. విజయ్ లాస్ట్ సినిమా జన నాయగన్. ఆ తర్వాత విజయ్ పొలిటికల్ గా బిజీ అవుతాడు. రజినీకాంత్ కి ఏజ్ అయిపోయింది. ఇప్పటికే చాలా కష్టంగా కేవలం ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తున్నారు. మహా అయితే ఇంకో నాలుగైదు సినిమాలు.
అజిత్ :
ఈ ఇద్దరి తర్వాత అంత స్టార్ డమ్ ఉన్న హీరో అజిత్. అజిత్ కి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. కానీ అజిత్ పవన్ కళ్యాణ్ లాగే. సినిమాల మీద ఫోకస్ చేయకుండా తనకు ఇష్టమైన కార్, బైక్ రేసింగ్స్ మీద ఫోకస్ చేస్తూ ఏదో చేయాలి అన్నట్టు సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నాడు. అజిత్ సినిమాల మీద ఫోకస్ చేస్తే కమర్షియల్ గా బాగా వర్కౌట్ అవుతుంది కానీ చెయ్యట్లేదు.
ధనుష్ :
ఇక ధనుష్ స్టార్ హీరో. ప్రతి సినిమా హిట్ అవుతుంది. కానీ ధనుష్ హిట్ సినిమాలకు కూడా వంద కోట్ల కలెక్షన్స్ రావడం కష్టంగా ఉంది. ధనుష్ కెరీర్ లో వంద కోట్ల సినిమాలు మూడో నాలుగో ఉన్నాయి. అవార్డులు, ప్రశంసలు వస్తాయి కానీ కలెక్షన్స్ రావట్లేదు. పైగా ధనుష్ నిత్యం వివాదాల్లో ఉంటాడు, ఫ్యాన్స్ కి దూరంగా ఉంటాడు. ప్రమోషన్స్ లో కూడా తక్కువగా ఉంటాడు. ధనుష్ ట్రై చేస్తే స్టార్ కమర్షియల్ హీరో అవుతాడు కానీ పట్టించుకోవట్లేదు. మధ్యలో డైరెక్షన్ కూడా చేస్తూ స్టార్ డమ్ ని వదిలేస్తున్నాడు.
Also Read : Rajinikanth : పవన్ కళ్యాణ్ గురించి.. రజినీకాంత్ సునీల్ కి ఏం చెప్పారో తెలుసా..?
సూర్య, విక్రమ్ చాలా ఏళ్లుగా ఫ్లాప్స్ చూస్తూనే ఉన్నారు. వీళ్ళు కమర్షియల్ సినిమాలు తీయడం మానేసి ప్రయోగాలు చేస్తుండటంతో అవి ఫెయిల్ అవుతున్నాయి. నటుడిగా ఎన్ని ప్రశంసలు అందుకున్నా సినిమాలు మాత్రం ఆడట్లేదు. ఈ ఇద్దరి హీరోలకు భారీ ఓపెనింగ్స్ కూడా కష్టమే. దీంతో అసలు ఈ హీరోలను కమర్షియల్ హీరోలుగా చూడటమే మానేశారు.
కార్తీ :
ఇక కార్తీ మంచి సినిమాలు తీస్తున్నా, మంచి పేరు తెచ్చుకున్నా మాస్ హీరో అవ్వలేకపోతున్నాడు. కార్తీకి క్లాస్, థ్రిల్లర్ సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి కానీ మాస్ హీరోగా చేసినవి ఫ్లాప్ అవుతున్నాయి. మన వెంకటేష్ లాగే కార్తీ కూడా పేరు తెచ్చుకున్నాడు. దీంతో కార్తీ సినిమాలు హిట్ అయినా భారీ ఓపెనింగ్స్ మాత్రం రావట్లేదు. కమర్షియల్ గా స్టార్ డమ్ రావట్లేదు.
కమల్ హాసన్ :
కమల్ హాసన్ అసలు మొదట్నుంచి కమర్షియల్ హీరో కాదు. ఆయన లోక నాయకుడు, నటనలో ఎంతో మెప్పించినా రజినీకాంత్ లా స్టార్ కమర్షియల్ హీరో అవ్వలేకపోయారు. అడపాదడపా కలెక్షన్స్ వచ్చిన హిట్ సినిమాలు తప్ప రెగ్యులర్ గా భారీ ఓపెనింగ్స్ తెప్పించలేరు. కమల్ కూడా ఇప్పుడు పొలిటికల్ లో దిగి రాజ్యసభ ఎంపీ అవ్వడంతో సినిమాల మీద ఫోకస్ తగ్గినట్టే.
Also Read : Dharma : సినిమాల్లో హీరోగా సక్సెస్.. పోలీస్ కేసు పెట్టిన భార్య..
శివ కార్తికేయన్ :
ప్రస్తుతం స్టార్ హీరో అయ్యే అవకాశాలు శివ కార్తికేయన్ కి ఉన్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇటీవల శివ కార్తికేయన్ సినిమాలు మెప్పిస్తున్నాయి. మంచి కలెక్షన్స్ తెప్పిస్తున్నాయి. కరెక్ట్ గా ఫోకస్ చేస్తే ఇతనే తమిళ్ లో నెక్ట్ సూపర్ స్టార్ అవుతాడు అని తమిళ నాట కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శివ కార్తికేయన్ మరి కమర్షియల్ స్టార్ హీరోగా ఎదుగుతాడా మిగిలిన హీరోల్లాగే సింపుల్ గా వెళ్ళిపోతాడా చూడాలి.
ఇక విజయ్ సేతుపతికి స్టార్ డమ్ ఛాన్స్ ఉన్నా అతను విలన్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ హీరోగా ఫోకస్ పక్కన పెట్టేసాడు.
విశాల్, శింబు, జయం రవి, ఆర్య, జీవా, అరుణ్ విజయ్, అధర్వ మురళి, విజయ్ ఆంటోనీ.. ఈ హీరోలంతా టైర్ 2 హీరోల్లాగే సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు హిట్స్ కొడుతూ వెళ్తున్నారు కానీ కమర్షియల్ స్టార్ హీరోలు అయ్యే ఛాన్స్ ఎవరికీ లేనట్టే. దీంతో తమిళ్ సినీ పరిశ్రమలో విజయ్, రజినీకాంత్ వెళ్ళిపోతే ఎవరు స్టార్ హీరో అవుతారు, ఎవరు కమర్షియల్ గా తమిళ పరిశ్రమని నడిపిస్తారు, ఎవరు భారీ ఓపెనింగ్స్ తెప్పిస్తారు అనే చర్చ మొదలైంది.