Rinku Singh: రింకూ అదరగొట్టావ్..! విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌లో ఈ కోణం కూడా ఉందా.. వీడియో వైరల్‌.. వాళ్లకు గట్టి పోటీ తప్పదా..!

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేందుకు రింకూ సింగ్‌కు అవకాశం రాకపోయినా బౌలింగ్ లో అదరగొట్టాడు. రెండు ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసి రింకూ..

Rinku Singh: రింకూ అదరగొట్టావ్..! విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌లో ఈ కోణం కూడా ఉందా.. వీడియో వైరల్‌.. వాళ్లకు గట్టి పోటీ తప్పదా..!

Rinku Singh

Updated On : August 19, 2025 / 8:55 AM IST

Rinku Singh: భారత క్రికెటర్ రింకూ సింగ్ పేరు వినగానే.. క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది విధ్వంసకర బ్యాటర్ అని. టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గానూ రింకూకు పేరుంది. అయితే, తాజాగా.. అతనిలో కొత్తకోణం బయటపడింది. ఈ విధ్వంసకర మిడిలార్డర్ బ్యాటర్ స్వరాష్ట్రంలో జరుగుతున్న యూపీ టీ20 లీగ్‌లో బౌలర్‌గా అవతారమెత్తి సత్తాచాటాడు.

Also Read: Varun Chakravarthy : ఆసియాక‌ప్‌ 2025 జ‌ట్టు ఎంపిక ముందు.. స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి కీల‌క వ్యాఖ్య‌లు..

యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మెవరిక్స్‌ జట్టుకు రింకూ సింగ్ ఆడుతున్నాడు. అయితే, సోమవారం మీరట్ మెవరిక్స్, కాన్పూర్ స్ట్రయికర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత మీరట్ జట్టు బ్యాటింగ్ చేసింది. అయితే, మాధవ్ కౌశిక్ 31 బంతుల్లో 95 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో మీరట్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన కాన్పూర్ జట్టు లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కాన్పూర్ పై మీరట్ జట్టు 86 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేందుకు రింకూ సింగ్‌కు అవకాశం రాకపోయినా బౌలింగ్ లో అదరగొట్టాడు. రెండు ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసిన రింకూ.. ఆదర్శ్ సింగ్ అనే బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ తీసిన తరువాత రింకూ తీవ్ర ఉద్వేగానికి‌లోనై సింహగర్జన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


రింకూలో బౌలింగ్ నైపుణ్యాన్ని చూసిన టీమిండియా ఫ్యాన్స్ భారత్ జట్టుకు మరో ఆల్‌రౌండర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు. టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో అంతఈజీ కాదు.. చోటు దక్కినా జట్టులో స్థిరంగా కొనసాగాలంటే ఆల్ రౌండర్ ప్రదర్శన చేయాల్సిందే. కేవలం బ్యాటింగ్‌లోనే మెరుపు మెరిపిస్తామంటే తుది జట్టులో చాన్స్ దక్కే అవకాశాలు కష్టమే.

అయితే, కొన్నాళ్లుగా భారత జట్టుకు దూరమైన రింకూ సింగ్ మరోసారి జట్టులో ప్లేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బంతి పట్టుకొని తనలోని మరో టాలెంట్‌ను బయటకుతీసి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. ఆసియా కప్ జట్టులో చోటు ప్రశ్నార్థకమైన వేళ రింకూ తనలోని బౌలింగ్ టాలెంట్ ను బయటకు తీసి సెలెక్టర్లను ఇంప్రెస్ చేశాడు. అయితే, బౌలర్‌గా రాణించినా ఆసియా కప్ జట్టులో రింకూకు చోటు దక్కతుందని చెప్పలేని పరిస్థితి.

ప్రస్తుతం భారత జట్టులో ఆల్‌రౌండర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. పలువురు ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యే జట్టులో రింకూకు ఏ మేరకు చోటు దక్కుతుందో వేచి చూడాల్సిందే.