రానా పెళ్లి ఎప్పుడంటే?: సురేష్ బాబు క్లారిటీ!

  • Published By: vamsi ,Published On : May 13, 2020 / 10:22 AM IST
రానా పెళ్లి ఎప్పుడంటే?: సురేష్ బాబు క్లారిటీ!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్ రానా దగ్గుబాటి ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. తన ప్రేయసి మిహీకా బాజాజ్‌తో లవ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే ప్రకటించిన రానా.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇదే అంశంపై రానా తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ‘బాంబే టైమ్స్’తో మాట్లాడుతూ తన కుమారుడ రానా పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. రానా, మిహీకా ఒకరికొకరు చాలా కాలంగా తెలుసునని చెప్పిన సురేశ్ బాబు.. వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలని అనుకోవడం సంతోషకరమని అన్నారు.

వివాహానికి సంబంధించిన అన్ని విషయాలను సరైన సమయంలో చెబుతామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి జరిగే అవకాశం ఉందని అన్నారు. అంతకు ముందే కూడా జరగవచ్చునని అన్నారు. అన్ని విషయాలు ఖరారైన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామన్నారు.

Read Here >> ప్రియురాలిని పరిచయం చేసిన రానా!