నిత్యా మీనన్ ‘డిజైనర్ డ్రెస్’ వేలం.. కరోనా సాయం!

  • Published By: srihari ,Published On : May 18, 2020 / 02:04 AM IST
నిత్యా మీనన్ ‘డిజైనర్ డ్రెస్’ వేలం.. కరోనా సాయం!

Updated On : October 31, 2020 / 2:13 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా గ్రామీణవాసుల నుంచి వలస కార్మికుల వరకు ఉపాధి కోల్పోయారు. కరోనా కష్టకాలంలో ఆకలితో బాధపడేవారికి సాయం చేసేందుకు సినీప్రముఖులు ఒక్కొక్కరుగా తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచిన స్థాయిలో వారు సహాయం చేస్తున్నారు. తమ అభిమానులను కూడా సాయం చేయమని వారిని ప్రోత్సహిస్తున్నారు.

ఇప్పుడు హీరోయిన్ నిత్యా మీనన్‌ కూడా పెద్ద మనస్సును చాటుకుంది. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందరిలా కాకుండా వినూత్నమైన దారిని ఎన్నుకున్నారు. గతంలో ఓ ఫ్యాషన్‌ షో కోసం తాను వేసుకున్న డిజైనర్‌ డ్రెస్‌ని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు నిత్యా మీనన్. ఈ వేలంలో వచ్చే మొత్తాన్ని ఓ ఫౌండేషన్‌ ద్వారా పలు గ్రామాలకు నిత్యా మీనన్ కరోనా సాయం చేయనున్నారు. 

Read Here>> జూ.ఎన్టీఆర్ బర్త్ డేకు RRR team surprise