BCCI : ఎట్ట‌కేల‌కు.. మాజీ ఆట‌గాడు గైక్వాడ్ చికిత్స‌కు బీసీసీఐ కోటి రూపాయ‌ల సాయం..

బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు అన్షుమాన్ గైక్వాడ్ సాయం చేసేందుకు బీసీసీఐ ముందుకు వ‌చ్చింది.

BCCI : ఎట్ట‌కేల‌కు.. మాజీ ఆట‌గాడు గైక్వాడ్ చికిత్స‌కు బీసీసీఐ కోటి రూపాయ‌ల సాయం..

BCCI announces one crore for treatment of cancer stricken Anshuman Gaekwad

BCCI – Anshuman Gaekwad : బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు అన్షుమాన్ గైక్వాడ్ కు సాయం చేసేందుకు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముందుకు వ‌చ్చింది. అత‌డి చికిత్స కోసం కోటీ రూపాయ‌లు విడుద‌ల చేయాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. ‘క్యాన్సర్‌తో పోరాడుతున్న అన్షుమాన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు తక్షణమే రూ.కోటి విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ని జై షా ఆదేశించారని.’ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.

అన్షుమాన్ గైక్వాడ్ కుటుంబంతో ఇప్ప‌టికే జై షా మాట్లాడార‌ని చెప్పింది. ఈ సంక్షోభ స‌మ‌యంలో గైక్వాడ్ కుటుంబానికి బీసీసీఐ అండ‌గా ఉంటుంద‌నే భ‌రోసా ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించింది. గైక్వాడ్ ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు బీసీసీఐ ప‌ర్య‌వేక్షిస్తూనే ఉంటుంద‌ని, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, అందుకు ఏ సాయం కావాల‌న్నా చేయడానికి సిద్ధంగా ఉన్న‌ట్లు ఆ ప్రకటనలో తెలియ‌జేసింది.

Wimbledon Final : వామ్మో అంతనా..? పురుషుల వింబుల్డన్ ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ ధ‌ర‌లు చూశారా..?

అన్షుమాన్ గైక్వాడ్ బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. గ‌త ఏడాది కాలంగా ఆయ‌న లండ‌న్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడు. 71 ఏళ్ల ఈ మాజీ ఆట‌గాడికి సాయం చేయాల‌ని క‌పిల్ దేవ్, మొహిందర్ అమర్‌నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ వంటి మాజీ ఆట‌గాళ్లు బీసీసీఐకి విజ్ఞ‌ప్తి చేయ‌గా తాజాగా బోర్డు స్పందించింది.

1974- 87 మధ్య అన్షుమాన్‌ గైక్వాడ్ భార‌త్‌ తరఫున 15 వన్డేలు, 40 టెస్టులు ఆడాడు. అనంత‌రం భార‌త జ‌ట్టుకు రెండు సార్లు ప్ర‌ధాన కోచ్‌గా ప‌నిచేశారు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా వ్యవహరించాడు. తర్వాత ఇతడు కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.

MS Dhoni : నేను సైనా నెహ్వాల్ భ‌ర్త‌ని.. ధోనితో క‌శ్య‌ప్‌.. త‌లా ఆన్స‌ర్ వైర‌ల్‌..