తమన్నా స్పెషల్ సాంగ్ వచ్చేసింది

బాలీవుడ్ మూవీ 'స్త్రీ 2' నుంచి ఆజ్ కీ రాత్ స్పెషల్ సాంగ్ విడుదలైంది. తమన్నా భాటియా గ్లామర్ షోతో డాన్స్ ఇరగదీసింది. రాజకుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, శ్రద్ధాకపూర్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఆగస్టు 15న స్త్రీ 2 మూవీ ధియేటర్లలో రిలీజ్ కానుంది.