Sachin Tendulkar : అంజలితో ప్రేమ.. తొలిసారి అత్తగారిని కలిసినప్పుడు సచిన్ ఏమన్నాడంటే..? ఆ విషయంలో భయపడిన అంజలి మదర్..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
![Sachin Tendulkar : అంజలితో ప్రేమ.. తొలిసారి అత్తగారిని కలిసినప్పుడు సచిన్ ఏమన్నాడంటే..? ఆ విషయంలో భయపడిన అంజలి మదర్.. Sachin Tendulkar : అంజలితో ప్రేమ.. తొలిసారి అత్తగారిని కలిసినప్పుడు సచిన్ ఏమన్నాడంటే..? ఆ విషయంలో భయపడిన అంజలి మదర్..](https://10tv.in/wp-content/uploads/2024/08/Anjali-Mother-Opens-Up-On-Daughters-Marriage-With-Sachin-Tendulkar.jpg)
Anjali Mother Opens Up On Daughters Marriage With Sachin Tendulkar
Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ ప్రపంచంలో అతడు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ఇక అభిమానులు అంతా క్రికెట్ దేవుడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక సచిన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. అతడు తన కన్నా ఐదేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అన్న సంగతి తెలిసిందే.
సచిన్-అంజలి ల వివాహం 1995 మే 24న జరిగింది. ఇటీవల వీరి వివాహాబంధం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగా.. తన కంటే ఐదేళ్లు చిన్నవాడైని పెళ్లి చేసుకుంటానని అంజలి చెప్పినప్పుడు ఆమె తల్లి అన్నాబెల్లె మెహతా ఎలా స్పందించారు అన్న విషయం చాలా మందికి తెలియదు. తాజాగా ఆ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ‘మై పాసేజ్ టు ఇండియా వెల్లడించింది. తొలిసారి సచిన్ ను కలుసుకున్నప్పుడు ఏం జరిగింది అన్న విషయాలను వెల్లడించింది.
తమ కుటుంబం ఇంగ్లాండ్ నుంచి 1950లో భారత్‌కు వచ్చి స్థిరపడినట్లుగా చెప్పుకొచ్చింది. సచిన్‌తో పరిచయం అనంతరం ఓ రోజు అంజలి అతడి గురించి తనకు చెప్పిందని, కొన్ని రోజులకు అతడు ఓ సారి తనను కలుసుకునేందుకు వచ్చాడంది. ఎంతో పొడవైన, అందమైన వ్యక్తిని అంజలి వివాహం చేసుకుంటుందని తాను అనుకున్నానని, అయితే.. సచిన్ చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయినట్లుగా తెలిపింది.
అంజలి తన కంటే ఐదు సంవత్సరాల తక్కువ వయసు ఉన్న వ్యక్తిని ప్రేమిస్తోంది. అతడు మా ఇంటికి వచ్చే సమయానికి అతడి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. అంజలి ఎత్తు ఐదున్నర అడుగులు. దాదాపు సచిన్ కూడా అంతే ఉండొచ్చునని అనిపించింది. క్రికెట్లో అతడు రాణిస్తాడని అర్థమైంది. అయితే.. కొద్ది మంది క్రికెటర్లలాగా అతడు ప్లేబాయ్ అవుతాడేమోనని నాకు సందేహం ఉండేది. దీని గురించి అతడితో మాట్లాడాలని అనుకున్నాను. అయితే.. సచిన్ ఇచ్చిన సమాధానం మాత్రం నన్ను ఆశ్చర్యపరిచింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పేశాడు. అప్పుడు వారి ప్రేమ అర్థమైంది. అని
అన్నాబెల్లె అంది.
పాక్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌కు అతని మామ ఏం బహుమతి ఇచ్చారో తెలుసా.. షాకవ్వాల్సిందే..!
తమ ప్రేమ విషయాన్ని చెప్పిన తరువాత దాదాపు మూడేళ్ల అనంతరం 22 ఏళ్ల ఏజ్‌లో సచిన్ పెళ్లి చేసుకున్నాడు.