Saina Nehwal : సైనా నెహ్వాల్ కామెంట్లు.. ప‌రోక్షంగా కేకేఆర్ క్రికెటర్‌కు కౌంట‌ర్.? మ‌ధ్య‌లో బుమ్రా పేరెందుకు..?

క్రికెట్ కంటే బ్యాడ్మింట‌న్, టెన్నిస్‌, బాస్కెట్ బాల్ ఆట‌లు శారీర‌కంగా చాలా క‌ష్టంగా ఉంటాయ‌ని ఇటీవ‌ల ఓ సంద‌ర్భలో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ అంది.

Saina Nehwal : సైనా నెహ్వాల్ కామెంట్లు.. ప‌రోక్షంగా కేకేఆర్ క్రికెటర్‌కు కౌంట‌ర్.? మ‌ధ్య‌లో బుమ్రా పేరెందుకు..?

Saina Nehwal On Comparisons With Cricket

Saina Nehwal : క్రికెట్ కంటే బ్యాడ్మింట‌న్, టెన్నిస్‌, బాస్కెట్ బాల్ ఆట‌లు శారీర‌కంగా చాలా క‌ష్టంగా ఉంటాయ‌ని ఇటీవ‌ల ఓ సంద‌ర్భలో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ అంది. దీనిపై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ర‌ఘువంశీ కాస్త వ్యంగంగా స్పందించాడు. భార‌త పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తే ఆమె త‌ట్టుకోగ‌ల‌దో లేదో చూడాలి అని అత‌డు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆ పోస్ట్‌ను వంశీ కాసేప‌టికే తొలగించాడు.

కాగా.. ర‌ఘువంశీ కామెంట్ల పై తాజాగా 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాగ్ ప‌రోక్షంగా స్పందించింది. నువ్వు విరాట్‌లా ఆడ‌తావా..? అలా అవ్వ‌గ‌ల‌వా..? రోహిత్ శ‌ర్మ‌లా అవ్వ‌గ‌ల‌వా..? ఎంతో మంది క్రికెట‌ర్లు వారిలాగా కావాల‌ని అనుకుంటారు అయితే అలా కావ‌డం చాలా క‌ష్టం. వారి స్థాయికి అతి త‌క్కువ మంది మాత్ర‌మే అందుకోగ‌ల‌రు. అది వారి వారి నైపుణ్యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అని సైనా అంది.

Paris Olympics : ఇవేం ప‌త‌కాలురా సామీ.. వారం రోజుల‌కే రంగు పోయింది.. సంచ‌ల‌నం రేపుతున్న అథ్లెట్ పోస్ట్‌..

ఇక బౌల‌ర్ల క‌ష్టం గురించి తాను అర్థం చేసుకోగ‌ల‌ను అంది. అస‌లు బుమ్రా బౌలింగ్‌ను తాను ఎందుకు ఎదుర్కొంటాను అని ప్ర‌శ్నించింది. ఒక‌వేళ తాను 8 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతూ ఉంటే అప్పుడు బుమ్రా పేస్‌కు స‌మ‌ధానం చెప్పిఉండేదానినేమో అని తెలిపింది. ఒక వేళ బుమ్రా బ్మాడ్మింట‌న్ ఆడితే తాను కొట్టే స్మాష్‌ల‌ను ఎదుర్కొన‌డం అత‌డికి క‌ష్ట‌మ‌ని తాను భావిస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చింది.

మ‌నం దేశం ఆడేట‌ప్పుడు ఇలాంటి విష‌యాల గురించి అన‌వ‌స‌రంగా ఫైట్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఏ క్రీడా అయిన అత్యుత్త‌మే. ఇత‌ర క్రీడాకారుల‌కు విలువ ఇవ్వండని మాత్ర‌మే తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ట్లు సైనా తెలిపింది. క్రికెట్, బాలీవుడ్‌పైన మాత్ర‌మే ఎప్పుడు మ‌న దృష్టి ఉంటుందా అని అంది.

Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో మ‌హిళా అథ్లెట్ పై అన‌ర్హ‌త వేటు..

రఘువంశీ ఐపీఎల్ 2024లో అరంగ్రేటం చేశాడు. కొన్ని కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడాడు. 10 ఇన్నింగ్స్‌లలో 155.24 స్ట్రైక్ రేట్‌తో 163 ​​పరుగులు చేశాడు, కేకేఆర్ మూడో సారి క‌ప్పును ముద్దాడ‌డంలో త‌న వంతు సాయం చేశాడు.