Nag Ashwin : నాగ్ అశ్విన్ నెక్స్ట్ ‘కల్కి 2’ తీయట్లేదా.. కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటన..
తాజాగా నాగ్ అశ్విన్ కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించారు.

Nag Ashwin Announced Required New Assistant Directors with Collaboration of AVM Studios
Nag Ashwin : ఇటీవలే ప్రభాస్ తో కల్కి సినిమా తీసి భారీ హిట్ కొట్టాడు నాగ్ అశ్విన్. ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఈ సినిమా మంచి విజయం సాధించింది. కల్కి సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కల్కి 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కల్కి 2 సినిమా నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలవుతుందని, 2025 లోనే సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాత అశ్వినీదత్ కూడా చెప్పారు.
Also Read : Mufasa: The Lion King : ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ట్రైలర్ రిలీజ్.. షారుఖ్, అతని పిల్లల వాయిస్‌లతో..
కానీ ఇప్పుడు కల్కి 2 సినిమా ఇప్పట్లో రాదా అనే సందేహాలు వస్తున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించారు. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM స్టూడియోస్, నాగ్ అశ్విన్ కలిసి ఒక సినిమా తీస్తున్నట్టు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
View this post on Instagram
అయితే ఇది నాగ్ అశ్విన్ దర్శకుడిగా చేసే కొత్త సినిమాకేనా? లేకపోతే నిర్మాతగా నాగ్ అశ్విన్ AVM స్టూడియోస్ తో కలిసి సినిమా చేస్తున్నాడా తెలియాలి. ఈ పోస్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ కల్కి 2 వదిలేసి కొత్త సినిమా చేస్తున్నాడేమో అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మరి దీనిపై నాగ్ అశ్వినే క్లారిటీ ఇవ్వాలి.