Indian Army Recruitment 2024: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఈ స్కిల్ ఉంటే లక్షల జీతంతో ఆఫీసర్ అయ్యే ఛాన్స్!

Indian Army Recruitment 2024 : కంప్యూటర్ పరిజ్ఞానం, సైబర్ సెక్యూరిటీపై పట్టు ఉంటే చాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల దరఖాస్తుదారులు నెలకు రూ. 2 లక్షల 17వేల జీతంతో ఆఫీసర్ అయ్యే అవకాశం..

Indian Army Recruitment 2024: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఈ స్కిల్ ఉంటే లక్షల జీతంతో ఆఫీసర్ అయ్యే ఛాన్స్!

Indian Army Recruitment 2024_ Opportunity to Become an Officer with This Monthly Salary ( Image Source : Google )

Indian Army Recruitment 2024: భారత ఆర్మీలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఇదే సరైన అవకాశం. ఆర్మీ 2024లో టెరిటోరియల్ ఆర్మీ ద్వారా ఆఫీసర్ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యం ఉన్న అభ్యర్థులు ఈ ప్రతిష్టాత్మక అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Read Also : NEET PG 2024 Results : నీట్ పీజీ 2024 ఫలితాలు త్వరలో విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..!

కంప్యూటర్ పరిజ్ఞానం, సైబర్ సెక్యూరిటీపై పట్టు ఉంటే చాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల దరఖాస్తుదారులు నెలకు రూ. 2 లక్షల 17వేల జీతంతో ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్హతలతో పాటు గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది.

దరఖాస్తు వివరాలివే :
దరఖాస్తు గడువు తేదీ : సెప్టెంబర్ 12, 2024
అప్లికేషన్ పోర్టల్ : http://jointerritorialarmy.gov.in

అర్హత ప్రమాణాలు :
వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 42 సంవత్సరాలు
విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సైబర్ సెక్యూరిటీ లేదా కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ.

ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థులకు అనేక దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ :
రాత పరీక్ష (సైబర్ భద్రత, సైబర్ చట్టాలు)

ప్రాక్టికల్ టెస్ట్
ఇంటర్వ్యూ

నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌తో సహా మరిన్ని వివరాల కోసం అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ (http://jointerritorialarmy.gov.in)ని విజిట్ చేయండి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అర్హత కలిగిన అభ్యర్థులను సైన్యంలో చేరడంతో పాటు జాతీయ భద్రతకు దోహదపడేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.

Read Also : Independence day 2024 : దేశాలు వేరైనా మనమంతా ఒక్కటే.. జెండా పండుగ రోజున ‘జయహో’ అంటున్న భారత్, పాకిస్థానీలు