Reliance Scholarships : రిలయన్స్ ఫౌండేషన్ ‘స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’ దరఖాస్తులు.. విద్యార్థులకు రూ.2 లక్షల స్కాలర్‌షిప్!
Reliance Scholarships : దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులను చదువుతున్న ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Reliance Scholarships : దేశమంతటా అత్యుత్తమంగా ఉన్న 5,100 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రిలయన్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ప్రారంభించినట్లు ప్రకటించింది.
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. తద్వారా విద్యార్థులు వారి విద్యా, వృత్తిపరమైన ఆకాంక్షలను సాధించడంలో స్కాలర్‌షిప్‌లు సాయపడతాయి. దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ కోర్సులను చదువుతున్న ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లను ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను సాకారం చేసుకోవడానికి తీసుకొచ్చింది. మొత్తంగా 5వేల మంది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారి అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ ఎడ్యుకేషన్ కోసం మెరిట్-కమ్-మీన్స్ ప్రమాణాల ఆధారంగా అందిస్తుంది. ఆర్థిక భారం లేకుండా వారి చదువును కొనసాగించడానికి వారికి చేయూత అందిస్తోంది.
గ్రాడ్యుయేట్లకు రూ. 2 లక్షల స్కాలర్‌షిప్ :
రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ వంటి కోర్సుల నుంచి 100 అసాధారణమైన ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తుంది. అన్ని స్కాలర్‌షిప్‌లు అకడమిక్ మెరిట్, ఆప్టిట్యూడ్ ఆధారంగా ఇస్తుంది. డిగ్రీ ప్రోగ్రామ్‌ల వ్యవధిని కూడా కవర్ చేస్తాయి.అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 2 లక్షలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 6 లక్షలు, రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.
Reliance Foundation Scholarships is now accepting applications for the 2024-25!
First year postgraduate and undergraduate students, seize the opportunity to advance your career and shape your future! Submit your application for the Reliance Foundation Postgraduate and… pic.twitter.com/kGvgz92Rwr
— Reliance Foundation (@ril_foundation) August 14, 2024
డిసెంబర్ 2022లో రిలయన్స్ వ్యవస్థాపకుడు-ఛైర్మన్ ధీరూభాయ్ అంబానీ 90వ జన్మదినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అండ్ చైర్‌పర్సన్ నీతా అంబానీ, రాబోయే 10 ఏళ్లలో రిలయన్స్ ఫౌండేషన్ 50వేల అదనపు స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. అదే, ఇప్పుడు భారత అతిపెద్ద ప్రైవేట్ స్కాలర్‌షిప్‌గా మారింది. అప్పటినుంచి ఏటా 5100 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నారు.
ఇప్పటి వరకు, రిలయన్స్ 23,000 ఉన్నత విద్యా స్కాలర్‌షిప్‌లను అందించింది. ఈ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ప్రొగ్రామ్ కోసం అప్లయ్ చేసుకోవాలనుకుంటే (www.scholarships.reliancefoundation.org) వెబ్‌సైట్ సందర్శించండి.