Asparagus Cultivation : అస్పరాగస్ సాగు విధానం! రైతులు పాటించాల్సిన మెళుకువలు!

నాటిన నెలకు బెడ్స్ లో ఒకసారి కలుపుతీసి మొక్కకు 50 గ్రా. చొప్పున ఎరువు మిశ్రమాన్ని 50 కి. యూరియా + 100 కి. సూపర్ ఫాస్ఫిట్ + 30 కి. పొటాష్ మొక్క దగ్గర వేయాలి. ఈ ఎరువు మిశ్రమాన్ని నెలకోసారి 75 గ్రా. వరకు మొక్క వయస్సు పెరిగే కొద్ది వేయాలి.

Asparagus Cultivation : అస్పరాగస్ సాగు విధానం! రైతులు పాటించాల్సిన  మెళుకువలు!

Asparagus

Asparagus Cultivation : అస్పరాగస్ అనేది బహువార్షిక మొక్క. సువాసనతో కూడిన తెలుపు నుంచి గులాబీ రంగు పూలనిస్తాయి. దుంపలు, విత్తనాలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. దీనిలో అనేక రకాలు ఉన్నాయి. అస్పరాగస్ డెన్ సిఫ్లోరన్, స్పిన్ గౌరి, అస్పరాగస్ అంబెట్లెటస్, అస్పరాగస్ డెన్ సిఫ్లోరస్ మేయర్, అస్పరాగస్ సియేసిటస్ పిరమిడల్స్, అస్పరాగస్ ఫలకేటస్ ముఖ్యరకాలు. వీటి కొమ్మలు పొడవుగా, నాజుకుగా తీగలాగా పెరుగుతాయి. సన్నని సూదిలాంటి ఆకుపచ్చని ఆకులతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కొమ్మలను అలంకరణలో వినియోగిస్తారు.

ఇవి సూర్యరశ్మి బాగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతుంది. చలికాలంలో పెరుగుదల తక్కువగా ఉంటుంది. లోతైన ఎర్ర గరప నేలలు దీని సాగుకు అనుకూలo. విత్తనం లేదా మొక్కలను వేరు చేసి నాటవచ్చు. నాటుకునేందుకు ముందుగా దుక్కిలో ఎకరాకు 20 టన్నుల పశువుల ఎరువు వేసి పొలాన్ని బాగా కలియదున్నాలి. బోదెలు తయారుచేసి మొక్కలను నాటుకోవాలి. 2 అడుగుల వెడల్పు, అడుగున్నర ఎత్తులో బెడ్స్ తయారు చేయాలి. రెండు బెడ్ల మధ్య అడుగు వెడల్పు దారి వదులుకోవాలి. బెడ్ కు ఇరువైపుల మొక్కకు మొక్కకు 45 సెం.మీ వరుసల మధ్య 30 సెం.మీ దూరం ఉండేలా నాటుకోవాలి. 3500 నుంచి 5000 మొక్కలకు తగ్గకుండా నాటుకోవటం మంచిది.

నాటిన నెలకు బెడ్స్ లో ఒకసారి కలుపుతీసి మొక్కకు 50 గ్రా. చొప్పున ఎరువు మిశ్రమాన్ని 50 కి. యూరియా + 100 కి. సూపర్ ఫాస్ఫిట్ + 30 కి. పొటాష్ మొక్క దగ్గర వేయాలి. ఈ ఎరువు మిశ్రమాన్ని నెలకోసారి 75 గ్రా. వరకు మొక్క వయస్సు పెరిగే కొద్ది వేయాలి. ఆరునెలలకోసారి పశువుల ఎరువు ఎకరాకు 3-5 టన్నుల వరకు సాళ్ళ మధ్యలో వేస్తే మొక్కలు త్వరగా పెరుగుతాయి. సూదిలాగా ఉండే ఆకులు ముదురాకు పచ్చరంగులోకి మారాక కొమ్మలను కత్తిరించుకోవాలి. అనంతరం మార్కెట్ కు తరలించాలి. కొమ్మలు మొక్కపై 20-30 రోజుల వరకు ఉంటాయి. ఒక్కో మొక్క కనీసం 150-200 కొమ్మలను ఇస్తుంది.

ప్రతి చదరపు మీటరుకు 5 కె.జి ల పశువుల ఎరువు వేసి మొక్కలను 45×45 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. నాటిన 6 నెలలకు మరొక్కసారి – 5. కిలోల పశువుల ఎరువు లేదా 500 గ్రా॥ వర్మీ కంపోస్టు వేయాలి. నాటిన 3వ నెలనుండి కొమ్మలను పొడవైన కాడతో భూమికి దగ్గరగా కత్తిరించి మార్కెట్టుకు పంపవచ్చు. ప్రతినెలకు ఒకసారి కొమ్మలను కత్తిరించవచ్చు. ఎండిన కొమ్మలను తీసి ఎరువును వేసినచో ఎక్కువ సంఖ్యలో పిలకల ఉత్పత్తి జరుగుతుంది. నాటిన మొదటి సంవత్సరంలో 1 చదరపు మీటరుకి 300 కొమ్మలను కోయవచ్చు. కొమ్మలు త్వరగా పొడవుగా పెరుగుటకు నీటిలో కరిగే పోషకాలనిస్తూ పైపాటిగా జిబ్బర్లిక్ ఆమ్మం 1 గ్రా/లీటరు నీటికి 1000 పిపియం. కలిపి పిచికారి చేసినచో కొమ్మలు బాగా పెరుగుతాయి.

సస్యరక్షణ:
ఫ్యూజేరియం, ఎండుతెగులు, కాండం కుళ్ళు తెగులు ఆశించి పిలకల ఉత్పత్తి తగ్గుతుంది. తెగులు ఆశించిన మొక్కలు ఎండిపోతాయి. ఈ మొక్కలను వేర్లతో సహా సమూలముగా నాశనం చేయాలి. కార్బండిజమ్ 1 గ్రా/లీటర్ నీటికి కలిపి ఈ తెగులు ఉధృతిని తగ్గించి పంటను కాపాడు కోవచ్చు.