Beekeeping : తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతులు!

తేనె టీగల పెంపకానికి సరైన రకాన్ని ఎంచుకోవాలి. పుట్ట తేనే తీగలు, ఐరోపా తినేటీగలు, కొండ తేనెటీగలు, చిన్నవిసనకర్ర తేనెటీగలనే 4 రకాలున్నాయి. రైతుల ఆర్ధిక స్థోమతను బట్టి మొదటి రెండు రకాల్లో ఒక దాన్ని ఎంచుకోవాలి.

Beekeeping : తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతులు!

Beekeeping, Proprietary Practices!

Beekeeping : తేనెటీగల పెంపకం వ్యవసాయాధారిత పరిశ్రమ. రైతుుల అదనపు అదాయం కోసం తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు. తేనెటీగలు పూలలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో దానిని నిల్వ చేసుకుంటాయి.తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండటంతో తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుండి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె , మైనము ప్రధానమైనవి.

తేనెటీగల పెంపకానికి కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం సరిపోతుంది. తేనెటీగల పెంపకానికి , మైనం తయారీకి వ్యవసాయ పరంగా కొద్దిపాటి స్ధలం సరిపోతుంది. కొద్దిపాటి వనరులు తేనెటీగల పెంపకానికి సరిపోతాయి. పర్యవరణంపై సానుకూల ప్రవాం ఉంటుంది. పూలు పూసే మొక్కలలో పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎంతగానో ఉపయోగపడతాయి. పొద్దుతిరుగుడు తోపాటు, వివిధ రకాల పంటలలో, పండ్ల మొక్కలలో అధిక దిగుబడికి తేనెటీగల పెంపకం ఉపయోగపడుతుంది.

తేనె చాల రుచికరమైన , అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్ధం, తేనె పట్టుకోసం అడవులలో తేనెటీగలను వేటాడటం పాత పద్ధతి. ఈ పద్ధతిలో ఎన్నెన్నో తేనెటీగలను పెంచి , తేనెను సేకరించటం వల్ల ఈ విధమైన తేనెటీగల వినాశనాన్ని నివారించుకోవచ్చు. తేనెటీగల పెంపకాన్ని ఎవరికి వారుగా గాని, బృందాలుగా కాని చేపట్టవచ్చు. తేనెకు , మైనానికి మార్కెట్ లో ఎంతో గిరాకీ ఉంది. తేనెటీగలను పెంపకాన్ని పొలంలో కాని ఇంటి వద్ద పెట్టెలలో చేపట్టవచ్చు.

తేనెటీగల పెంపకానికి కావలసిన పరికారాలు ;

తేనె పెట్టె ; ఇది పొడవుగా ఉండే ఒక చెక్క పెట్టె, దీనిపై భాగం నుండి కింది వరకు పొడవైన అనేక పెట్టెలు ఉంటాయి. ఈ పెట్టె కొలతలు 100సెంమీ వెడల్పు, 45 సెం.మీ ఎత్తు 25 సెం.మీ మందం 2 సెం.మీ తేనె టీగలు రావటానికి, పోవటానికి వీలుగా ఈ పెట్టెకు ఒక్కొక్కటి ఒక సెం.మీ వెడల్పు కలిగిన రంద్రాలు ఉంటాయి. పెట్టెకు, పైన పట్టెల బిగింపు రంద్రాలు మూసుకుపోని విధంగా ఉండాలి. పట్టెలు పెట్టె కింద వరకు ఉండాలి. ఎక్కవగా తేనెటీగలు పడితే ఆ బరువును తట్టుకునే విధంగా పట్టెలు 1.5 సెంమీ మందంతో ఉండాలి. పెట్టెలో తేనెటీగలు తిరగటానికి ఇరుకుగా ఉండకుండా , పెట్టెకు మధ్య కనీసం 3.3 సెం.మీ మీటర్ల ఎడం ఉండాలి.

పొగడబ్బా ; ఇది ముఖ్యమైన రెండవ రకం పరికరం. ఒక చిన్న డబ్బాను ఇందుకు ఉపయోగించవచ్చు. తేనెటీగలు కుట్టకుండా చూడటానికి , అదుపు చేయటానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది.

ప్రత్యేక డ్రస్ ; తేనె పట్టుకు దగ్గరగా ఉన్నప్పుడు తేనెటీగలు కుట్టకుండా కళ్లను కప్పిఉంచేలా ప్రత్యేమైన డ్రస్సును ధరించాలి. అలాగే ఒక చాకు అవసరం అవుతుంది. చాకు తేనె పట్టెపై పట్టెలను కదిలించి తేనె అరలను కత్తిరంచటానికి ఈక తేనె అర నుండి తేనెటీగలను నెట్టివేయటానికి తోడ్పడుతుంది.

పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ;

విద్యుత్ స్టేషన్లు, ఇటుక బట్టీలు, రైల్వే ట్రాకులకు దూరంగా తేనెపెట్టెలు పెట్టాలి. దగ్గర్లో స్వచ్ఛమైన పారే నీరు లభ్యమవ్వాలి. పెనుగాలులు, ఈదురు గాలుల నుంచి తేనెపట్టుల రక్షణకు సహజసిద్దమైన లేదా కృత్రిమంగా పెంచిన చెట్లుండాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ ప్రాంతంలో సూర్యరశ్మి పడేలా ఉండాలి. తేనె టీగల పెంపకానికి సరైన రకాన్ని ఎంచుకోవాలి. పుట్ట తేనే తీగలు, ఐరోపా తినేటీగలు, కొండ తేనెటీగలు, చిన్నవిసనకర్ర తేనెటీగలనే 4 రకాలున్నాయి. రైతుల ఆర్ధిక స్థోమతను బట్టి మొదటి రెండు రకాల్లో ఒక దాన్ని ఎంచుకోవాలి.

ఒక్కో పుట్ట తేనెపట్టు నుంచి 5-6 కిలోల తేనె వస్తే, ఐరోపా తేనెపట్టు నుంచి 15-20 కిలోల తేనె వస్తుంది. పట్టులను ఒకచోట నుంచి మరో చోటికి మార్చితే ఐరోపా తేనెపట్టుల నుంచి ఇంకా ఎక్కువ తేనె దిగుబడి వస్తుంది.