Chilli Crop : వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంటలో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు!

పంట నాశించే వివిధ రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా నోవాల్యురాన్ 0.75మి.లీ వంటి కీటక నాశిని మందులను పిచికారి చేయాలి.

Chilli Crop : వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంటలో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు!

Tips for Protecting Crops from Heavy Rains

Chilli Crop : ఈ మధ్యకాలంలో వర్షాల కారణంగా మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. నేపధ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. సరైన మోతాదులో మందులు వాడకంతోపాటు, సస్యరక్షణ చర్యలు చేపడితే పంటలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మిరప పంట వర్షం కారణంగా ఉరకెత్తిపోయింది. ఉకెత్తిన పొలాల్లో మొక్కలు వెంటనే తేరుకునేందుకు లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 10 గ్రాముల పంచదార కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

2. వేరుకుళ్లు అశించిన చేలలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు లేదా కార్బండిజమ్ 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి.

3. మొక్కలు వడబడి , తలలు వాలినట్లైతే లీటరు నీటికి 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు కలిపిన ద్రావణం పిచికారి చేయాలి. ఇనుపధాతులోపంతో మొక్కలు కాలిపోయినట్లు కనబడితే 10 లీటర్ల నీటికి 50 గ్రాముల అన్నభేదితో పాటు ఒక నిమ్మ చెక్క రసం కలిపి పిచికారి చేయాలి.

4. కాపుతో ఉండి వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదళ్ల చుట్టూ మట్టిని ఎగదోయాలి.

5. పైపాటుగా ఎకరానికి అదనంగా 30 కిలోల యూరియా 15 కిలోల పొటాష్, 200 కిలోల వేపపిండి వేయాలి. మొక్కలు తేరుకున్న తరువాత స్ధూల పోషకాల మిశ్రమాన్ని , సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

6. పంట నాశించే వివిధ రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లేదా నోవాల్యురాన్ 0.75మి.లీ వంటి కీటక నాశిని మందులను పిచికారి చేయాలి.

7. కాయకుళ్లు, కొమ్మ ఎండు తెగులు వ్యాప్తి చెందకుండా 1 మి.లీ ప్రోపికోనజోల్ లేదా 0.5మి.లీ డైఫెన్ కోనజోల్ లేదా 2.5 గ్రాముల కాపర్ హైడ్రక్త్సైజడ్ లేదా 2.5 గ్రాముల సాఫ్ మందులను లీటరు నీటికి కలిపి ఒకటి మార్చి మరొకటి వారం రోజుల వ్యవధిలో రెండు , మూడు సార్లు పిచికారి చేయాలి.

8. నేల అదనుకు వచ్చిన వెంటనే గొర్రు వేసి అంతరకృషి చేసినట్లైతే నేల వెంటనే ఆరుతుంది.