Layer Chickens : లేయర్ కోళ్లకు వ్యాధులు రాకుండా ముందస్తుగా ఇవ్వాల్సిన టీకాలు ఇవే!

లేయర్‌ కోళ్ల పెంపకంలో భాగంగా కోడి పిల్లలకు కొక్కెర తెగులు అదే విధంగా శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా లసోటా మరియు ఐబీ కలిసి ఉన్న వ్యాక్సిన్‌ను కోడి పిల్లల కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క ఇవ్వాల్సి ఉంటుంది. 8 నుంచి 10 రోజుల వయసులో లేయర్‌ కోళ్ల పిల్లలకు ముక్కులను కత్తిరించడమన్నది చేయాలి.

Layer Chickens : లేయర్ కోళ్లకు వ్యాధులు రాకుండా ముందస్తుగా ఇవ్వాల్సిన టీకాలు ఇవే!

Layer Chickens :

Layer Chickens : గుడ్లు పెట్టే లేయర్ కోళ్లను పెంచాలంటే అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అవి 72 వారాల పాటు ఎటువంటి వ్యాధులకు లోను కాకుండా కాపాడుకోవాలి. మొదటి రోజు నుంచి కూడా టీకాల కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించటం చాలా అవసరం. లేయర్ కోళ్లకు రెండు దశలుగా టీకాలను అందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదటి దశ టీకాలు ;

లేయర్‌ కోడి పిల్లలు వచ్చిన మొదటి రోజే మారెక్స్‌ వ్యాధి రాకుండా కోడి పిల్లల తలపైన ఉన్న చర్మానికి 0.2 మిల్లీ లీటర్ల మారెక్స్‌ వ్యాధి టీకాను వేయాలి. 5వ రోజు లసోటా, ఐబీ కలిసిన టీకాను వేయాలి

లేయర్‌ కోళ్ల పెంపకంలో భాగంగా కోడి పిల్లలకు కొక్కెర తెగులు అదే విధంగా శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా లసోటా మరియు ఐబీ కలిసి ఉన్న వ్యాక్సిన్‌ను కోడి పిల్లల కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క ఇవ్వాల్సి ఉంటుంది. 8 నుంచి 10 రోజుల వయసులో  లేయర్‌ కోళ్ల పిల్లలకు ముక్కులను కత్తిరించడమన్నది చేయాలి.

11వ రోజు గంబోరవ వ్యాధి రాకుండా ఇన్‌పెక్టివ్స్‌ బర్సల్‌ డిసీజ్‌ టీకాను కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క ఇవ్వాలి. 21వ రోజు మళ్లీ ఈ ఐబీడీ టీకాను మొదటి సారి చేసినట్టుగానే కంటిలో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క వేయాలి. 22 నుంచి 25 రోజుల వయసులో కోడి పిల్లల కాళ్లకు ఉన్న గోర్లను కత్తిరించాలి.

30వ రోజు మళ్లీ లసోటా మరియు ఐబీ రెండో డోసు టీకాను వెయ్యి కోళ్లకు అయితే 1500 డోసుల మందును తాగే నీటిలో కలిపి ఇవ్వాలి. 7 వారం మొదటల్లో ఫౌల్ పాక్స్ టీకా ఇచ్చి ఏడవ వారం చివరిలో కొరైజా కిలిడీ టీకాను ఇవ్వాలి. 8వ వారంలో వీవీఎన్ డి తొలి డోసు టీకాను వేసుకోవాలి.

రెండవ దశ టీకాలు ;

రెండవ దశ లేయర్ కోడి 11 వ వారానికి చేరుకున్న నాటి నుండి మొదలవుతుంది. 11వ వారంలో లేయర్ కోళ్లకు ఎన్ డీ కిలుడు టీకాను రెండో డోసు ఇవ్వాలి. 12వ వారంలో కొరైనా కిలుడు టీకాను రెండో డోసు ఇవ్వాలి. 13వ వారంలో ఫౌల్ పాక్స్ టీకాను రెండో డోసు వేయాలి. 14వ వారంలో వీవీఎన్ డీ టీ కాను రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. 16వ వారంలో ఎన్ డీ కిలుడు టీకాను మూడో డోసు వేయాలి.

టీకాలు ఇచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించటం మాత్రం మర్చి పోకూడదు. తెల్లవారు జామున లేదంటే సాయంత్ర సమయంలో టీకాలను వేసుకోవాలి. టీకాలు ఇచ్చే సమయంలో కోళ్లు బెదరకుండా చూడాలి. నీటిలో కలిపి ఇచ్చే సందర్భంలో నీరు చల్లగా ఉండేలా చూడాలి. నీటిని త్వరగా తాగటానికి నీటిలో టీకాతోపాటు, గ్లూకోజ్ కూడా కలిపి ఇవ్వాలి. గుడ్ల పెట్టే దశకు రాకముందే టీకాల ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.