Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్

వ్యవసాయంతో పాటు అనాదిగా రైతుకు ఆర్ధికంగా చేయూతనిస్తున్న రంగం పాడిపరిశ్రమ. తెలుగు రాష్ట్రాల్లో గేదెపాలను ఎక్కువగా ఇష్టపడతారు.

Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్

Milk Dairy

Milk Dairy: ఏ పనిలో అయినా, సంపద ఉంటే చాలదు. సంతృప్తి కూడా ముఖ్యమే. అందుకే చాలా మంది లక్షల్లో జీతం వస్తున్నప్పటికీ సాఫ్ట్‌వేర్ రంగాన్ని వదిలి, స్వయం ఉపాధి పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. అనుభవం లేకున్నా, ఆదిలో కాస్త అటుఇటూ అయినా ఇష్టంతో అవగాహన పెంచుకుని రాణిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువరైతు కూడా ఇలాగే భార్య సహకారంతో ముర్రాజాతి గేదెల డెయిరీ ఏర్పాటు చేసి భవిష్యత్తుకు బంగారు బాటులు వేసుకున్నారు.

వ్యవసాయంతో పాటు అనాదిగా రైతుకు ఆర్ధికంగా చేయూతనిస్తున్న రంగం పాడిపరిశ్రమ. తెలుగు రాష్ట్రాల్లో గేదెపాలను ఎక్కువగా ఇష్టపడతారు. నాటుగేదెల స్థానంలో అధిక పాల దిగుబడినిచ్చే ముర్రాజాతి గేదెలను హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని డెయిరీఫాంను అభివద్ధి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడి మండలం, నాగిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన యువరైతు తోట సతీష్ 10 గేదెలతో డెయిరీని ప్రారంభించి, ప్రస్తుతం 30 గేదెలకు పెంచారు.

…………………………………: కర్పూరం కంపెనీపై ఐటీశాఖ దాడులు

నెలకు అన్ని ఖర్చులు పోను, లక్షరూపాయల నికర ఆదాయాన్ని పొందుతూ.. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎంబీఏ చదివిన సతీశ్… కొన్నేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. కరోనా కాలంలో ఇంటి వద్దే ఉంటూ విధులను నిర్వర్తించారు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్లు.. పాడిపరిశ్రమ వైపు మళ్లేలా చేశాయి. తనకు వచ్చిన ఆలోచనలను కుటుంబ సభ్యులతో చర్చించి, వారిని ఒప్పించి సొంత ఊరిలోనే ప్రశాంతి పేరుతో డెయిరీ ఏర్పాటు చేసుకున్నారు.

4 ఎకరాల్లో పశుగ్రాసాలను పెంచారు. అందులో 2 ఎకరాలు హానీపాట్ రకం గడ్డిని పెంచుతుండగా, మరో 2 ఎకరాల్లో సూపర్ నేపియర్ గడ్డిని పెంచుతున్నారు. మొత్తం 365 రోజులు పాల దిగుబడి ఉండేలా ప్రణాళికలను తీర్చిదిద్దుకున్నారు. ప్రస్తుతం ప్రతి రోజు 160 లీటర్ల పాల దిగుబడిని సాధిస్తున్నారు. లీటరుకు 65 రూపాయల చొప్పున స్థానికంగానే అమ్ముతూ … మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

సతీష్ విజయంలో సగం పాత్ర తన భార్య ప్రశాంతిది ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు సతీష్ తో పాటు డెయిరీ నిర్వహణలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఏ నిర్ణయమైన ఇద్దరు కలిసి తీసుకుంటున్నారు. ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేని స్వయం ఉపాధిని పొందుతూనే మరి కొంత మందికి ఉపాధిని కల్పిస్తున్నారు.

పాడి పరిశ్రమలో, పెట్టే ఖర్చుపై నియంత్రణ ఉండాలి. వచ్చే ఆదాయంపై దూరదృష్టి తప్పనిసరి. పెద్ద డెయిరీల్లో పూర్తిగా కూలీలపై ఆధారపడి పనులు సాగటం, డెయిరీ నిర్వహణలో లోపాల వల్ల చాలమంది నష్టపోతున్నారు. ఈ మినీ డెయిరీలో పోషణకు అవసరమైన అన్ని సదుపాయాలు రైతే సమకూర్చుకోవటం, ఇతరులపై ఆధారపడే వ్యవస్థ ఎక్కువగా ఉండక పోవటం, నిత్య డెయిరీని పర్యవేక్షించటం వల్ల మంచి లాభాలు గడిస్తున్నారు.