IT Raids Camphor Industry : కర్పూరం కంపెనీపై ఐటీశాఖ దాడులు
చెన్నైలో ప్రముఖ కర్పూరం తయారీ కంపెనీపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు.

It Raids In Camphor Company
IT Raids Camphor Industry : చెన్నైలో ప్రముఖ కర్పూరం తయారీ కంపెనీపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. షావుకారు పేటలో నివసిస్తున్న్ కర్పూరం తయారీ దారు… రాజస్ధాన్ కు చెందిన పరాస్ జైన్ ఇళ్లు, కార్యాలయాలు. గోదాములు ఉన్న 15 ప్రాంతాలలో గురువారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
షావుకారుపేట స్టార్టన్ ముత్తయ్య వీథిలో నివసించే పరాస్ జైన్ కర్పూరం తయారు చేసే కర్మాగారాన్ని నడుపుతున్నారు. చెన్నైతో సహా పలు నగరాలకు ఆయన కర్పూరాన్ని హోల్ సేల్ గా అమ్ముతుంటాడు. కొన్నేళ్లుగా పరాస్ జైన్ పన్నులు ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావటంతో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Also Read : Girl Raped By Father : కన్న కూతురిపై తండ్రి అత్యాచారం
షావుకారుపేటలోని ఆయన నివాసాలు, గోదాములు, వేప్పేరిలోని కార్యాలయం, అన్నానగర్‌లోని కార్యాలయం సహా 15 చోట్ల ఒకే సమయంలో 60 మందికి పైగా అధికారులు, సాయుధ పోలీసులతో ఈ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పరాస్‌జైన్ నివాసం, కార్యా లయాల నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కీలకమైన దస్తావేజులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో పరాస్ జైన్ కర్పూరం తయారీకి సంబంధించిన ముడిసరకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని సుంకం కూడా చెల్లించలేదని గుర్తించారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.