CM Jagan: బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చూతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం

దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో, బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చూతూ తీర్మానం చేసినట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. దళితుడు మరో మతంలోకి వెళ్లినంత మాత్రాన జీవన స్థితిగతుల్లో మార్పు ఉండదని అందరికీ తెలుసు. మతం మారినందుకు వాళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులు రాకుండా పోవడం అన్యాయం.

CM Jagan: బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చూతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం

CM Jagan: ఏపీ అసెంబ్లీ శుక్రవారం రెండు కీలక తీర్మానాల్ని ఆమోదించింది. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో, బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చూతూ తీర్మానం చేసినట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఈ తీర్మానాల్ని కేంద్రానికి పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానాల గురించి సీఎం జగన్ మాట్లాడారు.

Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

‘‘రాయలసీమలో ఉండే బోయ,‌ వాల్మీకి కులస్ధులపై వన్ మ్యాన్ కమిషన్ అధ్యయనం చేసి నివేదిక తయారు చేసింది. బోయ, వాల్మీకి కులస్ధులను ఎస్టీల జాబితాలో చేర్చాలని కేంద్రానికి తీర్మానం చేసి పంపుతున్నాం. దీనిపై ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది. పాదయాత్ర సందర్భంగా తమను ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం చేశాం. దీనిపై గతంలో ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ హయాంలో తీర్మానం జరిగింది. మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం. ఒకరికి న్యాయం చేస్తూ మరొకరికి అన్యాయం చేసే ఉద్దేశ్యం లేదు. ఎస్టీలను గుండెల్లో పెట్టి చూసుకుంటా.

Viral Video: ప్రేక్షకులకు షాకిస్తున్న సీరియల్స్.. ఈ సీన్ చూస్తే హడలే… ఏకంగా తాడుతో చంద్రుడ్నే కిందకు లాగారు..!

ఏజెన్సీలో ఉన్న కులాలపై దీని ప్రభావం ఉండదు. వారికి అన్యాయం చేయను. సుప్రీంకోర్టులో ఏపీ తరపున మన వాదనలు వినిపిస్తున్నాం. అన్యాయం కాబడ్డ వాళ్లకు మన ద్వారా మంచి జరపాల్సిన బాధ్యత మనదే. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతూ తీర్మానం చేశాం. దళితుడు మరో మతంలోకి వెళ్లినంత మాత్రాన జీవన స్థితిగతుల్లో మార్పు ఉండదని అందరికీ తెలుసు. మతం మారినందుకు వాళ్లకు రావాల్సిన ఎస్సీల హక్కులు రాకుండా పోవడం అన్యాయం. పదేళ్లుగా గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 386 ఉద్యోగాలు మాత్రమే జారీ చేశారు. ఓట్ల కోసం కొంతమంది లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ప్రచారం చేస్తున్నారు’’ అని సీఎం జగన్ అన్నారు.