AP Covid : ఏపీలో కరోనా.. ఊపిరిపీల్చుకుంటున్న జనాలు, కొత్తగా ఎన్ని కేసులంటే
24 గంటల వ్యవధిలో 675 మందికి కరోనా సోకింది. చిత్తూరు, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...

Ap Corona Cases
Andhra Pradesh New Covid 19 Cases : ఏపీ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా వేల సంఖ్యలో వెలుగు చూసిన కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదైన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యలో రికార్డవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తోంది. రాత్రి వేళ కర్ఫ్యూను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఇక కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 675 మందికి కరోనా సోకింది. చిత్తూరు, కృష్ణా, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Read More : UK : లస్సా ఫీవర్.. యూకేలో ముగ్గురు మృతి
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,14,502 పాజిటివ్ కేసులకు గాను…22,88,989 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,705 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 10,808గా ఉందని తెలిపింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో అత్యధికంగా 143 మంది వైరస్ బారిన పడ్డారు. 24 వేల 663 శాంపిల్స్ పరీక్షించగా…675 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 2,414 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,28,93,908 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 32. చిత్తూరు 68. ఈస్ట్ గోదావరి 143. గుంటూరు 55. వైఎస్ఆర్ కడప 27. కృష్ణా 64. కర్నూలు 16. నెల్లూరు 28. ప్రకాశం 42. శ్రీకాకుళం 5. విశాఖపట్టణం 57. విజయనగరం 08. వెస్ట్ గోదావరి 130.
మొత్తం : 675
#COVIDUpdates: 16/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,14,502 పాజిటివ్ కేసు లకు గాను
*22,88,989 మంది డిశ్చార్జ్ కాగా
*14,705 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,808#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/kGxMiu4wvS— ArogyaAndhra (@ArogyaAndhra) February 16, 2022