Chittoor:చిత్తూరు జిల్లాలో వైరస్ తో ఏడు నెమళ్లు మృతి

చిత్తూరు జిల్లాలో నెమళ్లు మృతి కలకలం సృష్టించింది. సోమల మండలంలోని వ్యవసాయ పొలాల్లో ఏడు నెమళ్లు చనిపోయాయి.

Chittoor:చిత్తూరు జిల్లాలో వైరస్ తో ఏడు నెమళ్లు మృతి

Seven Peacocks Dead

Updated On : February 11, 2022 / 2:54 PM IST

Chittoor : చిత్తూరు జిల్లాలో నెమళ్లు మృతి కలకలం సృష్టించింది. జిల్లాలోని సోమల మండలంలో ఏడు నెమళ్లు చనిపోయాయి. మిట్టపల్లె సమీపంలోని పూలకొండ వ్యవసాయ పొలాల్లో మృతి చెందిన 7 నెమళ్లను స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలానికి పశు వైద్యు సిబ్బందితో సహాం చేరుకున్న అధికారులు నెమళ్లను పరిశీలించారు.

మృతి చెందిన నెమళ్ళకు పశు వైద్య అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. నెమళ్ల కళేబరాల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లుగా గుర్తించారు. నెమళ్ల మృతిపై అటవీశాఖ అధికారి శంకరశాస్త్రి మాట్లాడుతూ..బ్యాక్టీరియా వల్లనే నెమళ్లు చనిపోయాయని తెలిపారు.అయితే గాలి ద్వారానే ఈ వైరస్ తో నెమళ్లుకు సోకిందని అధికారులు భావిస్తున్నారు.