Guntur : అందరూ చూస్తుండగానే రమ్యను పది సార్లు పొడిచాడు, చూస్తూ ఊరుకున్న జనం

విద్యార్థిని రమ్యను హత్య తీవ్ర కలకలం రేపింది. హత్య జరిగిన సమయంలో సంఘటనాస్థలంలో చాలా మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా నిందితుడిని ఆపే ప్రయత్నం చేయలేదు.

Guntur : అందరూ చూస్తుండగానే రమ్యను పది సార్లు పొడిచాడు, చూస్తూ ఊరుకున్న జనం

Guntur Murder

B Tech Student Ramya : గుంటూరు జిల్లా బీటెక్‌ విద్యార్థిని రమ్యను హత్య ఏపీ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. హత్య చేసిన నిందితుడు శశికృష్ణను ముప్పాళ్ల మండలం గోళ్లపాడు సేఫ్‌ కంపెనీ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. దీంతో అతడు వెళ్లిన దారిని కనిపెట్టి గోళ్లపాడే సేఫ్‌ కంపెనీ దగ్గర అదుపులోకి తీసుకున్నట్టు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్ విద్యార్థిని రమ్యను శశికృష్ణ కత్తితో దారుణంగా పొడిచాడు. కాకాని రోడ్డులో వెళ్తున్న రమ్యను అటుగా వచ్చి శశికృష్ణ బైక్‌పై ఎక్కాలని కోరాడు.

Read More : Dalit Bandhu : హుజూరాబాద్ కు సీఎం కేసీఆర్, ఏర్పాట్లు ఎలా చేశారో తెలుసా ?

అందుకు ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య మెడ, పొట్ట భాగంలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. రక్తమోడుతున్న యువతిని స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు కాకాని రోడ్డులో రమ్యను కత్తితో పొడిచిన విజువల్స్ స్థానికంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. యువతిపై శశికృష్ణ అత్యంత కర్కశంగా కత్తితో ఒకటి కాదు… రెండు కాదు పదిసార్లు పొడిచాడు.

Read More : Tamil Nadu : పాణం తీసిన కోడి వివాదం

అప్పటికి శశికృష్ణ నుంచి తప్పించేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించినట్లు సీసీపుటేజీలో రికార్డైంది. హత్య జరిగిన సమయంలో సంఘటనాస్థలంలో చాలా మంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా నిందితుడిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఏ ఒక్కరైనా శశికృష్ణను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. కనీసం వద్దని వారించినా రమ్య బతికేది. కానీ అలాంటివి ఏం చేయకుండా చూస్తూ ఊరుకున్నారు. దీంతో వారి కళ్ల ముందే రమ్య తీవ్రగాయాలతో కిందపడిపోయి.. మృత్యువాత పడింది.

Read More : Adani Group : ఈ-కామెర్స్ లోకి అదానీ గ్రూప్.. పేటీఎం.. ఫోన్ పేల‌తో సై అంటే సై

రమ్య హత్యకు ముందు నిందితుడు 8 నిమిషాల పాటు వాగ్వాదానికి దిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాగ్వాదం తరువాత కొద్దిసేపటికే హత్య జరిగినట్లు గుర్తించారు. హత్య జరిగిన సమయంలో దగ్గరకు రావొద్దని శశికృష్ణ కత్తితో స్థానికులను బెదిరించినట్లు తెలుస్తోంది. రమ్య హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది.